Black Magic : ఎవడ్రా వీడు..అర్ధరాత్రి నగ్నంగా యువకుడు క్షుద్రపూజలు.. ఎందుకని అడిగితే!

ఓ యువకుడు అర్ధరాత్రి నగ్నంగా క్షుద్రపూజలు చేశాడు..ఏంటీ పనులు అడిగితే వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

New Update
black magic

ఓ యువకుడు అర్ధరాత్రి నగ్నంగా క్షుద్రపూజలు చేశాడు..ఏంటీ పనులు అడిగితే వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పూసిక్కల్‌మేడుకి చెందిన తిరుపతి కుమారుడు పరశురామన్‌. ఆ ప్రాంతంలోని రాజాత్తి అనే వ్యక్తి ఇంటి ముందు నగ్నంగా కూర్చుని పూజలు చేస్తూ కనిపించాడు. కుమరన్‌ అనే యువకుడు అక్కడకు వెళ్లి చూసి ఎందుకు ఇలా చేస్తున్నావని కుమరన్‌ అతడితో గొడవపడ్డాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి సర్దిచెప్పి పంపించారు. అనంతరం  ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

అయితే ఇంట్లో కుమరన్, అతని తల్లి నిద్రిస్తుండగా పరశురామన్‌ సోదరుడు శాంతకుమార్ ఇంట్లోకి చొరబడ్డాడు. కుమరన్‌ తలపై బండరాయితో దాడి చేసి చంపేయాడానికి  యత్నించాడు.  అతని తల్లి జయలక్ష్మి వెంటనే కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకున్నారు.  తీవ్రంగా గాయలపాలైన కుమరన్‌ను తిరుప్పత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరశురామన్, శాంతకుమార్ ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

కోర్టు గదిలో బియ్యం విసిరాడు 

ఢిల్లీలోని ఒక కోర్టు గదిలో ఒక వైద్యుడు బియ్యం విసిరిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై న్యాయవాదులు క్షుద్రపూజలు అని అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని కార్కర్‌డూమా కోర్టులో ఈ ఘటన జరిగింది.ఒక వైద్యుడికి సంబంధించిన కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వైద్యుడు తాను ఉన్న గదిలో బియ్యం గింజలను విసిరాడు. ఇది గమనించిన న్యాయవాదులు ఆశ్చర్యపోయారు. ఈ చర్యను మంత్రవిద్యకు సంబంధించినదిగా భావించారు. దీంతో న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ చర్యకు గల కారణం ఇంకా పూర్తిగా తెలియలేదు.న్యాయవాదుల అనుమానాలు, కోర్టు గదిలో ఇలాంటి సంఘటన జరగడం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.

Advertisment
తాజా కథనాలు