CMRF Scam: కోదాడలో  సీఎంఆర్ఎఫ్‌ కుంభకోణం..కోట్లల్లో నొక్కేసిన కేటుగాళ్లు

సూర్యాపేట జిల్లా  కోదాడ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్‌)లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య సమస్యలతో  సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా.. ఆ డబ్బులను వేరే ఖాతాలకు మళ్లించి నొక్కేసింది.

New Update
CMRF Scam In Suryapet

CMRF Scam In Suryapet

CMRF Scam: సూర్యాపేట జిల్లా  కోదాడ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్‌)లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య సమస్యలతో  సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా.. ఆ డబ్బులను వేరే ఖాతాలకు మళ్లించి నొక్కేసింది. కోదాడకు చెందిన  ఓ మాజీ ప్రజా ప్రతినిధి వద్ద పని చేసిన కొంతమంది  ఒక ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ డబ్బులను కొట్టేసినట్లు తెలిసింది. ఈ దందా 2020--21 నుంచి జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్

కాగా, వివిధ అనారోగ్య సమస్యలతో సీఎంఆర్ఎఫ్ కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సదరు చెక్కులు సంబంధిత ప్రజాప్రతినిధి కార్యాలయానికి చేరుకుంటాయి. అయితే వీటిని ఆయన కింద పనిచేసే సిబ్బంది పంపిణీ చేస్తామని చెప్పి తీసుకుంటుంది. ఆ తర్వాత అప్లై చేసుకున్నవారిని కాద‌‌ని ఇంటి పేరుకు దగ్గరగా పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఈ విషయంలో గతంలో సెక్రటేరియట్‌లో పనిచేసిన ఓ ఉద్యోగి.. ముఠాకు సహకరించినట్లు ప్రచారం సాగుతోంది. బ్యాంక్ అకౌంట్ నంబర్ మార్చి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా తమకు చెందిన ముఠాలోని ఓ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముఠా.. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకుంటున్నట్లు విచారణలో వెలుగుచూసింది. కాగా ఈ ముఠా వెనుక గత ప్రభుత్వం హయాంలో కోదాడలో కీలకంగా పనిచేసిన బీఆర్‌ఎస్‌ నాయకుడి హస్తం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 2022లో  హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆర్థికంగా ఇబ్బంది ఎదురు కావడంతో సీఎంఆర్ఎఫ్ కోసం బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు.  గద్దె వెంకటేశ్వరరావుకు 2023లో సీఎం సహయనిధి కింద లక్షన్నర మంజూరైంది. అయితే సదరు చెక్కు మాత్రం ఆయనకు రాలేదు. ఆ ముఠా గద్దె వెంకటేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చి గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి నగదును బదిలీ చేశారు. అనంతరం వాటిని కాజేశారు. అయితే ఏడాదిన్నర అవుతున్నా సీఎం సహాయ నిధి డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు. ఈ విషయమై సంబంధిత అధికారుల వద్ద విచారించాడు. అయితే డబ్బులు వచ్చాయని, వాటిని గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి మళ్లీంచారని తెలిసి షాక్‌ అయ్యాడు.

ఇది కూడా చూడండి:Shrishti Fertility Center: సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం.. భారీగా నిధులు తరలింపుపై అనుమానాలు

తనకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ డబ్బులు మరొకరు డ్రా చేసుకున్నారని తెలియడంతో అవాక్కయ్యాడు. తనకు రావలసిన సీఎంఆర్‌ఎఫ్‌ డబ్బులు జగ్గయ్యపేటకు చెందిన గడ్డం వెంకటేశ్వర రావు ఎస్‌బీఐ ఖాతాకు మళ్లీంచడం..ఆవి  డ్రా కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా గత కొంతకాలంగా సదరు ముఠా పలువురి సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను కాజేస్తుందని గుర్తించారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కోదాడ నియోజక వర్గానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు కలిసి ముఠాగా ఏర్పడి మోసం చేస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. ముఠాలోని మున గాల మండలం నారాయణ పురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా.. గడచిన నాలుగేళ్లుగా కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ డబ్బులు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: తీసుకున్న సొంత గొయ్యిలో పడ్డ పాకిస్తాన్.. 2 నెలల్లో రూ.1,240 కోట్లు నష్టం

Advertisment
తాజా కథనాలు