Eternal Groom: వీడో నిత్యపెళ్లికొడుకు.. చివరికి పదోతరగతి బాలికతోనూ..

వాడు ఖాకీ చొక్కా వేసుకున్న కామాంధుడు.. పెళ్లిళ్ల పేరుతో అమ్మాయిలకు నరకం చూపిస్తున్న రాక్షసుడు. పెళ్లి పేరుతో వరుసగా అమ్మాయిలను మోసం చేస్తూ ఒకటికాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.

New Update
Constable Krishnam Raju

Constable Krishnam Raju

Eternal Groom : వాడు ఖాకీ చొక్కా వేసుకున్న కామాంధుడు.. పెళ్లిళ్ల పేరుతో అమ్మాయిలకు నరకం చూపిస్తున్న రాక్షసుడు. పెళ్లి పేరుతో వరుసగా అమ్మాయిలను మోసం చేస్తూ ఒకటికాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు. అతని కామానికి ఓ మైనర్‌ బాలికతో పాటు ముగ్గురు మహిళలు బలయ్యారు. అయితే ఐదో పెళ్లి విషయం వెలుగు చూడడంతో అతన్ని డిపార్ట్‌మెంట్‌ నుంచి సస్పెండ్‌ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన కానిస్టేబుల్‌ కృష్ణంరాజు నిత్యపెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. కాగా మైనర్‌బాలికను వివాహం చేసుకుని ఆమెను శారీరంగా హింసిస్తున్న సంఘటనతో కానిస్టేబుల్‌ కృష్ణంరాజుపై సూర్యాపేట గ్రామీణ పోలీసులు పోక్సో చట్టం(pocso-act) కింద కేసు నమోదు చేశారు. 

మునగాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కృష్ణంరాజు వరుసగా నాలుగు పెళ్లిళ్లు(marriges) చేసుకున్నాడని, అందులో మూడో వివాహం ఏడాది క్రితం సూర్యాపేట మండలానికి చెందిన పదోతరగతి  బాలికతో జరిగినట్లు ఇటీవల వెలుగు చూసింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ నరసింహ స్పందించి వారం రోజుల క్రితం కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. బాధ్యతయుతమైన పోలీస్ వృత్తిలో ఉన్నా.. అతని బుద్ధి మాత్రం వక్రీకరించింది. 2012 బ్యాచ్‌కు చెందిన కృష్ణంరాజు క్రమశిక్షణారాహిత్యంతో ఇప్పటికే అనేకసార్లు సస్పెండ్ అయ్యాడు. ఇక ఇప్పుడు నిత్య పెళ్లి కొడుకులా మారి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.

Also Read :  భార్యని హత్య చేసిన భర్తని పోలీసులకు పట్టించిన నాఫ్తిలిన్ గోలిలు

Eternal Groom With A Tenth Grade Girl

కానిస్టేబుల్‌ కృష్ణం రాజుకు మొదటిసారి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మహిళతో మొదటిసారి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెతోను గొడవల కారణంగా ఆమె వదిలేసి వెళ్లింది. ఆమెతో విడాకుల కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అయితే కేసు కోర్టులో నడుస్తుండగానే ముచ్చటగా మూడో వివాహం కూడా చేసుకున్నాడు.  అది కూడా పెటాకులైంది.  అంతటితో ఆగకుండా సూర్యాపేటకు చెందిన ఓ 13 ఏళ్ల మైనర్ బాలికను నాలుగో వివాహం చేసుకున్నాడు. అది తప్పు అని తెలిసిన ఒక బాధ్యత గల వృత్తిలో ఉండి కూడా పదో తరగతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాక ఆ బాలికను శారీరకంగా హింసించాడు. దీంతో వాడి వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెను కూడా దూరం పెట్టేశాడు కృష్ణం రాజు. ఇదంతా చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.ఈ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం ఆ నోటా ఈ నోటా పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో కృష్ణంరాజుపై చర్యలకు సిద్ధం అయ్యాయి. కానిస్టేబుల్‌ వివాహం చేసుకున్న బాలిక వయసు 13ఏళ్లు కావడంతో ఆమె తల్లి నుంచి ఫిర్యాదు తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

 ఇక కానిస్టేబుల్ కృష్ణంరాజు నిత్యపెళ్లికొడు మాత్రమే కాదు… లంచగొండి కూడా అని ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో తిరుమలగిరి మండలంలో డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో ఇసుక దందాలో డబ్బులు వసూలు చేస్తున్నాడని…. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు, డ్యూటీలో ఉండగానే రీల్స్ చేయడం కూడా కృష్ణంరాజుకు ఉన్న మరో దరిద్రపు అలవాటు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లో కూర్చోని రీల్స్ చేయడం.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేయడం… వచ్చిన కామెంట్స్, లైక్స్‌తో మహిళలను ట్రాప్ చేయడం కూడా కానిస్టేబుల్ కృష్ణంరాజు ప్రత్యేకత. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్స్ పెట్టడం చేయడంతో ఆయనపై అనేక ఫిర్యాదుల అందాయి. దీంతో లా అండ్ ఆర్డర్ విధులను తప్పించి లూప్ లైన్‌కు పంపిచారు ఉన్నతాధికారులు. అయినా పద్దతి మార్చుకోని కానిస్టేబుల్ కృష్ణంరాజు వరుసగా వివాహలు చేసుకుని వివాదాల్లో చిక్కాడు.ఈ విషయంపై జిల్లా ఎస్పీ నరసింహ స్పందించి వారం రోజుల క్రితం కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. 

Advertisment
తాజా కథనాలు