/rtv/media/media_files/2025/08/20/suryapet-electric-shock-incident-2025-08-20-12-08-50.jpg)
Suryapet Electric Shock Incident
Suryapet: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో వరుసగా విద్యుత్ ప్రమాదాలు(Current Shock Incidents) కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ రామంతాపూర్‌లో కరెంట్ షాక్ తో ఏడుగురు మరణించిన ఘటన తర్వాత, తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో విషాద ఘటన(Suryapet Electric Shock Incident) చోటుచేసుకుంది.
మంగళవారం మధ్యాహ్నం, సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న దంతాల చక్రధర్ (50) అనే వ్యక్తి అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన కోసం వెళ్లారు. అయితే అనుకోని విధంగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ షాక్ తగిలి, ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
వెంటనే ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం కోసం పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి వివరాలు తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
విద్యుత్ శాఖ హెచ్చరిక..
ఇటీవలి కాలంలో తెలంగాణలో వర్షాలు భారీగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. విద్యుత్ శాఖ ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తూ, వర్షకాలంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెగిపోయిన తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీప ప్రాంతాల్లో ఆచితూచి ఉండాలని సూచించింది.
ప్రజలు అజాగ్రత్తతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న తప్పులే ప్రాణాలు తీస్తున్నాయి. పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, ఎలక్ట్రిక్ బాక్స్‌ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వాటికి తాకడం, వాటి సమీపంలో ఏ పనైనా చేయడం అత్యంత ప్రమాదకరం. వర్షాలు పడుతున్న సమయంలో, రోడ్లపై నీరు నిలిచిన చోట వెళ్లాల్సి వస్తే ఆచి తూచి అడుగువేయండి. అనవసరంగా రోడ్లపై దేనిని ముట్టుకోవద్దు. విద్యుత్ ప్రమాదాలను తక్కువ అంచనా వేయకూడదు. చిన్న అజాగ్రత్తే పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ప్రజలందరూ తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా ఈ విషయాలపై మరింత శ్రద్ధ పెట్టి. ఇక ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.