Adulterated Liquor: కల్తీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు...మద్యం సీసాల్లో స్పిరిట్ నింపి.....

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్‌ఫోర్సు బృందం సోమవారం దాడి చేసింది.  హుజూర్‌ నగర్ ఎక్సైజ్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి మూడు ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారు చేసే ముఠాను పట్టుకున్నారు.

New Update
A gang of adulterated liquor makers has been arrested.

A gang of adulterated liquor makers has been arrested.

Adulterated Liquor:

సూర్యాపేట(Suryapet) జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్‌ఫోర్సు(Telangana Excise Department) బృందం సోమవారం దాడి చేసింది.  హుజూర్‌ నగర్ ఎక్సైజ్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి మూడు ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారు చేసే ముఠాను పట్టుకున్నారు. కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్సు బృందం రామాపురంలోని తోట శివ శంకర్, నూకల సూర్యప్రకాశ్‌ అనే వ్యక్తుల ఇళ్లు, ఓ రైస్‌మిల్లు సమీపంలోని షెడ్లలో తనిఖీలు నిర్వహించారు. మేళ్లచెరువు మండల కేంద్రంలో, మండల పరిధిలోని వేపల మాదారం, రామాపురం గ్రామంలో ఈ కల్తీ మద్యం దందా నిర్వహిస్తున్న తీరు చూసి పోలీసులే ఈ అవాక్కయ్యారు. మూడు ప్రాంతాల్లో వివిధ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. 

ఇది కూడా చూడండి:Pahalgam Attack: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

వీరు తయారు చేస్తున్న కల్తీ మద్యాన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించగా గుంటూరు జిల్లా రేపల్లెలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో తీగలాగితే డొంకంతా కలిగినట్టు దొరికిన వ్యక్తులు మేళ్లచెరువు మండలం నుంచి వచ్చినట్లు సమాచారం ఇవ్వగా, సమాచారాన్ని హుజూర్‌ నగర్ ఎక్సైజ్ పోలీసులకు అందించారు. దీంతో ఎక్సైజ్ పోలీసులు మేళ్లచెరువు, వేపల మాదారం, రామాపురం గ్రామంలో దాడులు చేసి కల్తీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో శంకర్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న నూకల ప్రకాష్ కు చెందిన రైస్ మిల్ లో కల్తీ మద్యం తయారు చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి సరఫరా చేస్తున్నట్లు తేలింది. రైస్ మిల్లులో భారీ ఎత్తున కల్తీ మద్యం లభ్యమయింది.

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

కల్తీ మద్యం తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 832 లీటర్ల స్పిరిట్ తో పాటు 326 లీటర్ల బాటిళ్లలో నింపిన 38 కాటన్ల విస్కీ బాటిళ్లు, కల్తీ మద్యం బాటిళ్లపై అంటించే నకిలీ లేబుళ్లు, ఎక్సైజ్‌ హీల్స్‌ లభ్యమయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్సు సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్‌నగర్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ స్టేషన్‌ సిబ్బందితో నిర్వహించిన ఈ దాడుల్లో సూర్య ప్రకాశ్, దుర్గి(ఆంధ్రప్రదేశ్‌)కి చెందిన శ్రీరాం మహేష్‌లను అరెస్టు చేశారు. వీరితో పాటు వీరికి స్పిరిట్, నకిలీ లేబుళ్లు సరఫరా చేసిన రూతుల శ్రీనివాస్‌(హైదరాబాద్‌), శివ చరణ్‌ సింగ్‌(కృష్ణా ఫార్మా)లపై కేసులు నమోదయ్యాయని సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. 

Also Read: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

వేపల మాదారం గ్రామంలో లొడంగి నవీన్ ఇంట్లో కూడా కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు మండల కేంద్రమైన మేళ్లచెరువులో నాగరాజు అనే వ్యక్తి నుంచి కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వివిధ మద్యం దుకాణాల్లో పనిచేసిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఈ కల్తీ మద్యం దందాకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. కల్తీ మద్యం తో పాటు ఏపీ 07 డి జెడ్ 6789 నెంబర్ గల కారు ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కల్తీ మద్యం తయారీ కేంద్రాలు హుజూర్‌ నగర్ తో పాటు కోదాడ నియోజకవర్గంలో కూడా పలు ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. వీటిపై కూడా ఎక్సైజ్ పోలీసులు కూపి లాగుతున్నట్లు తెలిసింది.

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Advertisment
తాజా కథనాలు