BREAKING: బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ
హైదరాబాద్ సన్ సిటీలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందకి దూకింది. అప్రమత్తమైన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.