వ్యాపారం బాగా జరగడంతో మహిళ ఫిర్యాదు.. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య!

ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో దారుణం జరిగింది. మర్రిగుంట దళితవాడకు చెందిన గంగాధరం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గాజుల మన్యం పోలీసులు కొట్టిన దెబ్బలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు.

New Update
pakala beach

ఏపీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కిరాణా షాపు వ్యాపారం కోసం ఇంటి గదిని అద్దెకు తీసుకున్నాడు. షాపు పెట్టి రెండు మూడు వారాలే అయింది. ఆ షాపుకి బాగా గిరాకీ పెరిగింది. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. ఇది గమనించిన ఆ ఇంటి యజమానురాలు తానే కిరాణా షాపు పెట్టుకుంటానని.. ఆ గదిని ఖాళీ చేయమని చెప్పింది. దీంతో ఆ కిరాణా షాపు వ్యక్తి కొద్ది రోజులు సమయం అడిగాడు. కానీ ఆమె దానికి ఒప్పుకోకపోగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని ఒప్పించే ప్రయత్నంలో బాగా కొట్టారు. దీంతో తన పరువు పోయిందని భావించిన ఆ వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

పోలీసులు కొట్టడంతో చెవి, నోటంట రక్తం

ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట దళితవాడకు చెందిన గంగాధరం (39)కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతడు సునీత అనే ఓ మహిళ ఇంటి గదిని అద్దెకు తీసుకుని కిరాణా షాప్ నడిపాడు. ఆ షాపు మీద వచ్చిన డబ్బులతోనే భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. షాప్ పెట్టి రెండు మూడు వారాలే అయింది. వ్యాపారం బాగా జరుగింది. డబ్బులు బాగా వస్తున్నాయి. 

 Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...

దీంతో తనతో పాటు తన ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. కానీ ఈ లోపు గంగాధరానికి ఊహించని సంఘటన ఎదురైంది. వ్యాపారం బాగా జరగడంతో తానే దుకాణాన్ని నిర్మించుకోవాలని ఇంటి యజమాని సునీత భావించింది. దీంతో గదిని ఖాళీ చేయమని గంగాధరాన్ని కొరింది. అయితే దుకాణం ఏర్పాటు చేసి నెల కూడా కాలేదని.. తనకు మూడు నెలల సమయం ఇవ్వాలని.. అప్పుడే ఖాళీచేయగలనని గంగాధరం పేర్కొన్నాడు.

Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు   

సునీత చెప్పినా గంగాధరం పెడచెవిన పెట్టడంతో, సునీత అక్క కొడుకు చక్రి తన స్నేహితులతో కలిసి గంగాధరాన్ని బెదిరించి దాడి చేసారు. అయినా గంగాధరం వారికి సర్ది చెబుతూ సమయం కావాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఇంటి యజమాని సునీత పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు గాజ మన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దళిత వాడకు వెళ్లి ఎస్సై పిలుస్తున్నాడంటూ గంగాధరాన్ని బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. 

Also Read: స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు

ఆపై పోలీస్ స్టేషన్‌లో గంగాధరాన్ని తీవ్రంగా కొట్టారు. దీంతో గంగాధరానికి చెవి, నోట్లో నుంచి రక్తం రావడంతో అతడ్ని గ్రామంలో విడిచిపెట్టారు. ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తాళలేక, గ్రామంలో జరిగిన అవమానానికి గంగాధరం తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గుర్తించిన గంగాధరం కుటుంబ సభ్యులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గంగాధరం మృతిచెందాడు. పోలీసులు కొట్టిన దెబ్బలవల్లే తన కొడుకు మృతి చెందాడని తల్లి ఆవేదన చెందుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు