కష్టాలు, కన్నీల్లు వీటన్నింటిని దాటుకుంటూ పోతే చక్కని జీవితం. కానీ వీటిని జయించడంలో ఎంతో మంది విఫలం అవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయంతో కుటుంబం అల్లకల్లోలం అవుతుంది.
ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఎలాంటి విషాదం జరగదు. కానీ అలా ఆలోచించే వారే కరువవుతున్నారు. ఏదో జరిగిపోయింది.. ఇక నేను ఈ లోకంలో జీవించలేను.. నాకు చావే తగినది అంటూ నిర్ణయం తీసుకుని కన్న బిడ్డలకు, కని పెంచిన తల్లిదండ్రులకు, కట్టుకున్న వారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు.
ఇది కూడా చూడండి: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు
అమ్మా నన్ను బావిలో తొయ్యకు
ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరొకటి జరిగింది. వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను తీసుకొని బావిలో దూకి ఆత్మ హత్య చేసుకోవాలనుకుంది. కానీ అందులో ఒక బిడ్డ అమ్మ నన్ను బావిలో పడేయకు అంటూ వేడుకోవడంతో తనను వెళ్లిపోప్పని మరో బిడ్డతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇంటికొచ్చిన ఆ బిడ్డ జరిగిన విషయం చెప్పడంతో అంతా కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడీ ఘటన వికారాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది.
ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్..ఈ మార్గంలోనే తొలి రైలు!
వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గేటువనంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. అరుంధ అనే వివాహిత మేకలకు మేత వేద్దామని కూతురు ప్రజ్వల, కుమారుడు రిత్విక్‌ని పొలం వద్దకు తీసుకెళ్లింది. అనంతరం ఆమె ముందు కూతురుని బావిలో తొయ్యడానికి ప్రయత్నించింది.
ఇది కూడా చూడండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!
కానీ కూతురు ప్రజ్వల అమ్మ నన్ను బావిలో తొయ్యకు అమ్మ అంటూ వేడుకోవడంతో తనను ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత కొడుకును బావిలో తోసి అరుంధ ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇంటికి చేరుకున్న ప్రజ్వల జరిగిన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి ప్రజ్వలను ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చూడండి: నేడు నగరంలో భారీ ఎయిర్ షో..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
ఆ చిన్నారి ప్రజ్వల జరిగింతా చెప్పింది. శేఖర్ అనే వ్యక్తి తన తల్లికి కాల్ చేసి ఏడిపించాడని.. చనిపోయే ముందు తన తల్లి శేఖర్‌కు కాల్ చేసి చనిపోతున్నా, గుడ్ బై అంటూ ఏడుస్తూ చెప్పిందని కూతురు ప్రజ్వల పోలీసులకు చెప్పింది. అంతేకాకుండా ఆమె ఏడుస్తూ చెప్తున్న మాటలు అందరినీ కలచివేస్తున్నాయి.