Chat GPT: చాట్ జీపీటీ సృష్టికర్త, అమెరికన్ ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓపెన్ ఏఐ మాజీ రీసెర్చర్, విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ (26)కొద్ది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. Also Read: చేయని తప్పుకు జైల్లో వేశారు.. ఇక తగ్గేదేలేదు: పుష్పరాజ్ ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసే సుచిర్ శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో నవంబర్ 26న చనిపోయి కనిపించాడు. తన ఫ్లాట్‌లో మృతి చెంది కనిపించినట్టు పోలీసులు తెలిపారు. ఆయన మృతికి గల కారణాన్ని మాత్రం వైద్యులు ఇంకా తెలపలేదు. Also Read: ఓటీటీలోకి వచ్చేసిన మాస్ కా దాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? న్యాయపరమైన వివాదాలు... అయితే, ఇప్పటికైతే సుచిర్ మృతి విషయంలో ఎలాంటి అనుమానాలు వ్యక్తం కావడం లేదని పోలీసులు వివరించారు. మరణానికి మూడు నెలల ముందు సుచిర్ మాట్లాడుతూ చాట్‌జీపీటీ డెవలప్‌మెంట్ విషయంలో ఓపెన్ ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపణలు చేశాడు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన చాట్‌జీపీటీ.. రచయితలు, ప్రోగ్రామర్లు, జర్నలిస్టుల నుంచి న్యాయపరమైన వివాదాలు ఎదుర్కొన్నవిషయం తెలిసిందే. Also Read: Bunny: బన్నీ పై ఎవరికో ద్వేషం ఉంది.. వైరల్ అవుతున్న వేణుస్వామి వీడియో! ఈ ప్రోగ్రాంను అభివృద్ది చేసే క్రమంలో తమ కాపీరైట్ కంటెంట్‌ను ఉపయోగించుకుందని వీరు ఆరోపణలు చేశారు. ఈ ఉల్లంఘనల విలువ 150 బిలియన్ డాలర్లు పైనే ఉంటాయని తెలుస్తుంది. అక్టోబర్ 23న "న్యూయర్క్ టైమ్స్"కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలాజీ మాట్లాడుతూ వ్యాపారాలు, పారిశ్రామికవేత్తలపై ఓపెన్ ఏఐ ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చాడు. Also Read: అల్లు అర్జున్ FIRలో తప్పుడు రిపోర్ట్..కోర్టులో నవ్వుకున్న లాయర్లు ఇంటర్నెట్ ఎకోసిస్టంకు ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని తెలిపాడు. సుచిర్ నాలుగేళ్లపాటు ఓపెన్ ఏఐలో పనిచేశాక ఉద్యోగానికి రాజీనామా చేసి కొంతకాలం క్రితమే బయటకు వచ్చేశాడు.