Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

పంట నష్టపోవడంతో ఓ రైతుల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. మూగ, చెవుడు అయిన భద్రు నాలుగెకరాలు కౌలుకి తీసుకుని పత్తి, మిరప సాగుకి రూ.18 లక్షలు అయ్యింది. పంట నష్టపోవడంతో అప్పులు తీర్చలేక ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమా?

దేశం ఎంత అభివృద్ధి చెందుతున్న రైతుల చావులు మాత్రం తగ్గడం లేదు. వ్యవసాయంలో లాభాలు రాక.. అప్పుల బాధలతో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ రైతు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. భద్రు అనే రైతు మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడేంలో ఉంటున్నాడు. ఇతనికి పుట్టుకతోనే చెవుడు, మూగ సమస్యలు ఉన్నాయి. అయితే మూడేళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ పొలంలో మిరప, పత్తి పంటలు వేసి సాగు చేస్తున్నాడు.

ఇది కూడా చూడండి:  ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్!

పంట కోసం చేసిన అప్పు తీర్చలేక..

కుటుంబ పోషణ, పంట ఖర్చు మొత్తం దాదాపుగా 18 లక్షలు అయ్యింది. పోని పంట చేతికి వచ్చిందా? అంటే అదీ లేదు. పూర్తిగా పంట మొత్తం నష్టపోయాడు. ఇంత పెద్ద మొత్తంలో అప్పు ఎలా తీర్చాలని ఆందోళన చెందుతూ ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భద్రు సోదరుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: బంగాళాఖాతంలో మరో వాయుగుండం..ముంచుకొస్తున్న మూడు తుపాన్లు!

ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కాలేజీ  యువతి ఆత్మహత్య చేసుకుంది. దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యలు కళాశాలకు చెరుకున్నారు. కాలేజ్ బయట ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి వచ్చారు. శ్రావణి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. 

ఇది కూడా చూడండి: ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్!

ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు