ఆమెకు పెళ్లైయి మూడు నెలలే అయింది. ఎంతో సంతోషంగా జీవించాలనుకుంది. కానీ ఈ క్రమంలోనే ఆమెను అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఆ వివాహితకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఊహించని నిర్ణయం తీసుకుంది. మూడో అంతస్తుపై నుంచి దూకి ఆమె సోమవారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రం ఏసీసీలో జరిగింది.
Also Read : 'పుష్ప2' లో ఆ సీన్ చూసి మైండ్ దొబ్బింది.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్
Married Woman Commits Suicide
స్థానిక కృష్ణానగర్‌లో నివాసముంటున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ వాహనం డ్రైవర్ శ్రీనివాస్ తన కుమార్తె రోషిణి(22)కి ఇటీవల వివాహం చేశాడు. బెల్లంపల్లిలోని బూడిదగడ్డకు చెందిన గొడిసెల ప్రేమ్‌కుమార్‌తో ఆగస్టులో మ్యారేజ్ అయింది. అయితే రోషిణి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది.
Also Read: హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్.. పదోతరగతి ఉంటే చాలు!
దీంతో పుట్టింటికి వెళ్తామని తన భర్తను అడిగింది. ఇందులో భాగంగానే గత నెల 27న భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. అక్కడ కొన్ని రోజులు బాగానే ఉంది. సోమవారం రోషిణి తెల్లవారుజామున ఉదయం 4.30 గంటలకు మూడో అంతస్తుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే రెండో అంతస్తులో ఉండే ధర్మాజీరాజు చూశాడు. పైకి ఎందుకు వెళ్తున్నావని అడిగాడు.
Also Read: Actress: బీచ్‌లో యోగా చేస్తుండగా..హీరోయిన్ ని లాక్కెళ్లిన రాకాసి అల!
నిద్రపట్టడం లేదని.. అలా కాసేపు పైకి వెళ్లి వస్తానని చెప్పింది. అనంతరం ఆమె బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కిందికి దిగి చూసే సరికి రోషిణి తీవ్రగాయాలతో ఉంది. వెంటనే మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచింది.
Also Read: PV Sindhu: పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పి.వి.సింధు
news being update..