Jurala Project : జూరాలకు భారీ వరద.. 23 గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో అధికారులు 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,14,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,21,904 క్యూసెక్కులుగా ఉంది.