/rtv/media/media_library/vi/ZSf3kI2e0mw/hq2.jpg)
Srisailam reservoir
Srisailam reservoir : గత కొన్ని రోజులుగా ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం జలాశయానికి వదర ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టు నుండి అధికారులు ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది.
ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!
ప్రస్తుతం శ్రీశైలం డ్యాం ఒక గేటు 10 అడుగల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుత ఇన్‌ఫ్లో 73,586 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 95,677 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులుగా ఉంది. మొన్నటి వరకు భారీ వర్షాలు కురవడంతో జలాశయానికి భారీగా వరదనీరు చేరింది. దీంతో గేట్లను ఎత్తు నీటిని వదిలారు. ప్రస్తుతం కాస్త తగ్గముఖం పట్టింది. అయితే కుడిఎడమ కాలువల ద్వారా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది.
ఇది కూడా చూడండి:Chhangur Baba : హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ముస్లింలకు నిధులు.. ఛంగూర్ బాబా అరాచకాలు!