/rtv/media/media_files/2025/03/02/O52cp4vhNVTApp8TNdEx.jpg)
Srisailam:శ్రీశైలం ప్రధానాలయంలో చోరీ జరగడం కలకలం రేపుతోంది. తెల్లవారుజామున హుండీ నుంచి ఓ వ్యక్తి డబ్బును కాజేశాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలను గుర్తించిన సిబ్బంది అతడిని పట్టుకున్నారు. అనంతరం అతడి నుంచి డబ్బును రికవరీ చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలయం సీఈవో ఇప్పటివరకు స్పందించలేదు.
గతంలోనూ..
ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం కూడా ఆలయంలో దొంగతనం జరగడం గమనార్హం. స్థానికంగా నివసించే ఇద్దరు మైనర్లు దర్శనం కోసమని వచ్చి.. ఆలయం హుండీ నుంచి డబ్బులు కాజేయడానికి ప్రయత్నించారు. ఆలయ ప్రారంభంలో ఉన్న క్లాత్ హుండీని బ్లేడుతో కోసి డబ్బులు తీస్తుండగా.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలను పరిశీలించిన అధికారులు వెంటనే వారిని పట్టుకున్నారు. అలాగే వారు కాజేసిన రూ. 10,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. దేవస్థానం సీఈవో ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పది రోజులుగా వీరు దర్శనం పేరుతో క్యూ లైన్లో వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.