/rtv/media/media_files/2026/03/01/jaya-2026-03-01-11-38-32.jpg)
Sanath Jayasuriya
Sanath Jayasuriya: శ్రీలంక(sri-lanka) క్రికెట్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ జట్టు హెడ్ కోచ్ సనత్ జయసూర్య(sanath-jayasuriya) తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. టీ20 వరల్డ్ కప్(2026 T20 World Cup) లో శ్రీలంక జట్టు కనీసం సెమీఫైనల్స్ చేరలేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్-8 దశలో లంక జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తన చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడిన లంక.. కెప్టెన్ దాసున్ శనక మెరుపు ఇన్నింగ్స్ ఆడినా 5 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
Also Read: 47 ఏళ్లుగా అమెరికా కుట్రలు..
https://t.co/G6qRMXGOk9 Sanath Jayasuriya to step down as Sri Lanka head coach -
— IndianPremierLeague (@CricketT20IPL) March 1, 2026
‘I’m sad about that’ – Sanath Jayasuriya makes big announcement after Sri Lanka’s exit from T20 World Cup. (Ph... pic.twitter.com/Vtvi3ZOfoL
Also Read : పరిస్థితి భయంకరంగా ఉంది.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న పీవీ సింధు
జయసూర్య కీలక కామెంట్స్
పదవి నుంచి తప్పుకోవడంపై జయసూర్య కీలక కామెంట్స్ చేశారు. "ఇది మరొకరికి అవకాశం ఇచ్చే సమయం అని నేను భావిస్తున్నాను. నిజానికి ఇంగ్లాండ్ సిరీస్ సమయంలోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. వరల్డ్ కప్(t20-world-cup) లో జట్టును గెలిపించి, ఒక మంచి ముగింపుతో తప్పుకోవాలనుకున్నాను. కానీ అలా జరగనందుకు నాకు చాలా బాధగా ఉంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి తన కాంట్రాక్ట్ జూన్ వరకు ఉందని, త్వరలోనే శ్రీలంక క్రికెట్ బోర్డుతో చర్చించి అధికారికంగా రాజీనామా సమర్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. జయసూర్య లాంటి దిగ్గజం కోచ్‌గా తప్పుకోవడం శ్రీలంక క్రికెట్‌కు పెద్ద ఎదురుదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Follow Us