BREAKING: శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్

శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శుక్రవారం అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని CID అదుపులోకి తీసుకుంది. 2023లో ఆయన భార్యతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లినందుకు ప్రభుత్వ నిధులు ఉపయోగించినట్లు ఆయనపై అభియోగాలు వచ్చాయి.

New Update
Former Sri Lankan President

Former Sri Lankan President

శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శుక్రవారం అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని CID అదుపులోకి తీసుకుంది. 2023లో ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భార్యతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లినందుకు ప్రభుత్వ నిధులు ఉపయోగించినట్లు ఆయనపై అభియోగాలు వచ్చాయి. ఈ పర్యటనలో వోల్వర్హాంప్టన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యూయేషన్ డే కార్యక్రమంలో పాల్గొనడాన్నారు. ఈ పర్యటన అధికారంగా చేపట్టింది కాదని తర్వాత ప్రకటించారు. కానీ, దానికి ప్రభుత్వ నిధులను వినియోగించారు. దీనికి ప్రభుత్వ నిధులు వినియోగించలేదని విక్రమసింఘే వాదించినప్పటికీ, సీఐడీ మాత్రం ఆయన వాదనను తోసిపుచ్చింది.

విచారణ కోసం ఆయనను కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) పిలిపించింది. విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను త్వరలో కోర్టు ముందు హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ప్రజల నిరసనల నేపథ్యంలో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన తర్వాత, 2022లో విక్రమసింఘే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

రాజకీయ జీవితంలో ఆరుసార్లు ప్రధాన మంత్రిగా, ఒకసారి అధ్యక్షుడిగా పనిచేసిన విక్రమసింఘే, ఈ అరెస్ట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ అరెస్ట్ ప్రభావం చూపనుంది. విక్రమసింఘేపై ఉన్న ఆరోపణలు, దాని వెనుక ఉన్న రాజకీయ ప్రతీకారాలపై ప్రస్తుతం శ్రీలంకలో చర్చ జరుగుతోంది.

Advertisment
తాజా కథనాలు