Pak-Sri lanka: బాబోయ్ మేమిక్కడ ఆడలేం..స్వదేశానికి బయలుదేరిన శ్రీలంక ఆటగాళ్ళు

ప్రస్తుతం శీలంక, పాకిస్తాన్ మధ్య వన్డే సీరీస్ అవుతోంది. అయితే రెండు రోజుల క్రితం ఇస్లామాబాద్ లో బాంబు పేలడంతో శ్రీలంక ఆటగాళ్ళు మేమింక ఇక్కడ ఆడలేమంటూ స్వదేశానికి బయలుదేరుతున్నారని తెలుస్తోంది. దీంతో వన్డే సీరీస్ రద్దు చేస్తారని చెబుతున్నారు.

New Update
sri lanka

పాకిస్తాన్, శ్రీలంకల మధ్య వన్డే సీరీస్ సందిగ్ధంలో పడింది. పాకిస్తాన్ తన సొంతగడ్డ మీద శ్రీలంక తో మూడు మ్యాచ్ లు వన్డే సీరీస్ ఆడుతోంది. ఇప్పటికి ఒక మ్యాచ్ జరిగింది. రేపు రెండో మ్యాచ్ రావల్పిండిలో జరగనుంది. అయితే ఇక మీదట వన్డే సీరీస్ జరగకపోవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి కారణ్ శ్రీలంక జట్టు తాము ఇంక పాకిస్తాన్ లో ఆడలేమని చెప్పిందని తెలుస్తోంది. ఒక ఎనిమిది మంది క్రికెటర్లు పెట్టె బేడా సద్దుకుని స్వదేశానికి పయనమయ్యారని కూడా చెబుతున్నారు.

భయపెడుతున్న ఇస్లామాబాద్ బాంబ్ దాడి..

రెండు రోజుల క్రితం ఇస్లామాబాబ్ లోని సెషన్స్ కోర్టు ఆవరణలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఇందులో 12 మంది మరణించారు. ఈ సంఘటన తర్వాత పాక్ లో మ్యాచ్ లు ఆడడానికి శ్రీలంక జట్టు భయపడుతోందని ఆదేశ క్రికెట్ బోర్డు చెబుతోంది. ఇస్లామాబాద్‌కు చాలా దగ్గర్లోనేరావల్పిండి ఉండడం భద్రతపై తమ క్రికెటర్లు ఆందోళన చెందడానికి కారణమని ఓ శ్రీలంక బోర్డు అధికారి చెప్పారు. దీనికి ముందు వన్డే సీరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ రావల్పిండిలోనే జరిగింది. దీనిలో పాకిస్తాన్ గెలిచింది. మూడో వన్డేకూరావల్పిండిఆతిథ్యమివ్వాల్సింది. షెడ్యూలు ప్రకారం వన్డే సిరీస్‌ తర్వాత శ్రీలంక.. పాకిస్థాన్‌లో జింబాబ్వేతో కలిసి ముక్కోణపు సిరీస్‌ కూడా ఆడాల్సి ఉంది. కానీ దీనికి శ్రీలంక క్రికెటర్లు ఏమాత్రం సుముఖంగా లేరు. దీంతో పాక్‌-శ్రీలంక సిరీస్‌, దాని తరువాత ముక్కోణపు సీరీస్ కూడా రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే శ్రీలంకతో మాట్లాడిందని.. పాక్ బోర్డు ఛైర్మన్మొహసీన్నఖ్వీ క్రికెటర్ల భద్రతకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. వారిని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారని అంటున్నారు. కానీ శ్రీలంక జట్టు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు.

పదేళ్ల పాటూ పాక్ కు వెళ్ళని క్రికెట్ జట్లు..

పాకిస్తాన్ లో శ్రీలంక జట్టుకు చేదు జ్ఞాపకం ఉంది. 2009లో లాహోర్ లో గడాఫీ స్టేడియానికి వెళుతున్న శ్రీలంక జట్టు బస్సుపై తీవ్రవాదులు దాడి చేశారు. ఇందులో అజంత మెండిస్, చమింద వాస్, మహేలజయవర్దనే సహా చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. చాలా మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. దీని తరువాత దాదాపు పదేళ్లు పాకిస్తాన్ కు ఏ దేశపు క్రికెట్ జట్టూ వెళ్ళలేదు. 019 డిసెంబరులో శ్రీలంక పర్యటనతోనే పాకిస్థాన్‌కు తిరిగి విదేశీ జట్ల రాక మొదలైంది. కానీ ఇప్పుడు మళ్ళీ అవే ఆందోళన కలిగించే పరిస్థితులు కనిపిస్తుండడంతో శ్రీలంక క్రికెటర్లు భయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు