Ditwa Cyclone: దిత్వా తుఫాను దెబ్బకు శ్రీలంక విలవిల..56 మంది మృతి

శ్రీలంకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి దిత్వా తుఫాను కూడా తోడైంది. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఇందులో 56 మంది మృతి చెందారు.

New Update
ditwa

శ్రీలంక(sri-lanka)లోని పలు ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుఫాను కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దీని కారణంగా 56 మంది మరణించినట్లు శ్రీలంక ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. మరో 21 మంది గల్లంతయ్యారు. వరద ధాటికి 600కి పైగా ఇళ్ళు, స్కూళ్ళు దెబ్బతిన్నాయి. చాలా వంతెనలు కొట్టుకోపోయాయి. రహదారులు, పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. వరదల్లో గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. లాండ్ స్లైడ్స్ కారణంగా 12 వేల ఇళ్ళు కూలిపోయాయి.  శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు.

Also Read :  ఘోర అగ్నిప్రమాదం.. 128 మంది మృతి

మరో రెండు రోజులు భారీ వర్షాలు..

దిత్వా తుఫాను ధాటి ఇప్పుడే మొదలైంది. ఇది ఇంకా తీరాన్ని తాకలేదు. దానికి మరో రెండు రోజులు టైముంది. కానీ ఈ లోపునే తుఫాను ప్రభావం చూపిస్తోంది. అన్నింటి కంటే శ్రీలంక ఎక్కువ ఎఫెక్ట్ అయింది. దిత్వా కారణంగా శ్రీలంకలో చాలా నగరాలు వరదలో చిక్కుకుపోయాయి. దీంతో శ్రీలంక ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేసింది. రైలు సర్వీసులు నిలిపివేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలను దింపింది. అక్కడ వారు సహాయక చర్యలు చేపట్టాయి. రానున్న రెండు రోజుల్లో దేశంలో మరిన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అక్కడి వాతావరణశాఖ హెచ్చరించింది.

Also Read :  77 ఏళ్ళల్లో అతి పెద్ద అగ్ని ప్రమాదం..కృత్రిమ వానకూ ఆరని మంటలు

Advertisment
తాజా కథనాలు