BIG BREAKING : శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం.. 21 మంది మృతి!

శ్రీలంకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.   కోట్మలే వద్ద ఉన్న గెరాండియెల్లా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మందికి పైగా గాయపడ్డారు.

New Update
srilanka bus accident

శ్రీలంకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.   కోట్మలే వద్ద ఉన్న గెరాండియెల్లా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మందికి పైగా గాయపడ్డారు. 70మంది  బౌద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సు కోట్మలే ప్రాంతం వద్ద ఉన్న లోయలో పడిపోయింది.  బస్సు కెపాసిటీ కంటే 20 మందిని ఎక్కువగా తీసుకెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.  డ్రైవర్ బస్సుపై నియంత్రణను కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇటీవలి నెలల్లో శ్రీలంకలో జరిగిన అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదాలలో ఇది ఒకటి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు