Theft: సూర్యపేటలో భారీ చోరీ.. 18 కిలోల బంగారం మాయం
సూర్యపేట జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలో ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో జరిగిన దొంగతనంలో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సూర్యపేట జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలో ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో జరిగిన దొంగతనంలో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్‌లో బుల్లెట్ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్‌లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు.
నిర్మల్ జిల్లా భైంసాలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు ఏకంగా 31 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.
ఒక కిరాణ షాపు యజమానిని పిస్టల్‌తో బెదరించి డబ్బులు దోచుకున్న సంఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 71 వేల 150 రూపాయలతో పాటుగా ఒక బొమ్మ పిస్టల్, 4 సెల్ ఫోన్స్ 4 సెల్ ఫోన్స్, రెండు యాక్టివా బైక్స్ లను స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులో భారీ దొంగతనం జరిగింది. వడపళనిలో రూ.20 కోట్ల విలువైన వజ్రాలను నలుగురు వ్యక్తుల ముఠా దోచుకెళ్లింది. వ్యాపారి చంద్రశేఖర్ మరో వ్యాపారవేత్తకు ఇచ్చేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. శివకాశి టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్--తిరుపతి -రాయలసీమ ఎక్స్‌ప్రెస్ లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను అపహరించారు.
ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల పేరు చెప్పి భార్యాభర్తలను దోపిడీ చేసిన ఘటన వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో దోపిడీ కలకలం రేపింది. కొందరు దుండగులు పోలీసుల పేరుతో రోడ్డుపై ఇద్దరు దంపతుల బైక్ ఆపి..బంగారు ఆభరణాలను అపహరించారు.
బిహార్‌లోని తనిష్క్ షోరూమ్‌లో సోమవారం భారీ దోపిడీ జరిగింది.పట్టపగలే బంగారు ఆభరణాల షోరూంలోకి చొరబడిన దుండుగులు దోపిడీకి తెగబడ్డారు. దుకాణం తెరవగానే పక్కా ప్లాన్‌తో దోపిడీ చేసి.. అక్కడ నుంచి పరారయ్యారు.నిందితులను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు.