/rtv/media/media_files/2025/07/15/7-graduates-steal-motorbikes-by-following-youtube-videos-2025-07-15-20-01-57.jpg)
7 graduates steal bullet bikes by following YouTube videos
బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్‌లో బుల్లెట్ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీళ్లందరు కూడా ఇంజినీరింగ్ విద్యార్థులే కావడం గమనార్హం. వీళ్లలో ఆరుగురు ఒంగోలులో, మరొకరు కందుకూరులో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: విదేశాల్లో బతకడం అంత ఈజీ కాదు, కాస్త ఆలోచించండి.. భారతీయ టెకీ పోస్ట్ వైరల్
Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
7 Graduates Steal Bullet Bikes
ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటిదాకా వీళ్లు 16 బుల్లెట్ బైక్‌లు, ఒక స్కూటీని దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. వీటి విలువ మొత్తం దాదాపు రూ.25.20 లక్షలుగా ఉన్నట్లు పోలీసులు అంచనా వేశారు. బుల్లెట్ వాహనాలు చోరీ అయినట్లు.. అద్దంకిలో 9 కేసులు నమోదయ్యాయి. అలాగే చిలకలూరిపేటలో 2, జె.పొంగులూరులో 2, మద్దిపాడులో 1, నరసరావుపేటలో 1 కేసులు నమోదయ్యాయి. నిందితులు బుల్లెట్ వాహనాలే టార్గెట్ చేయడంతో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ దీన్ని తీవ్రంగా పరిగణించారు.
ఈ క్రమంలోనే అద్దంకి సీఐ సుబ్బరాజు నేతృత్వంలోని ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. టవర్ డంప్ అంటే టవర్ పరిధిలో ఉండే మొబైల్ నంబర్లపై నిఘా పెట్టే సాంకేతికతను వినియోగించి నిందితుల జాడ తెలుసుకున్నారు. చివరికి అద్దంకి సమీపంలో 16 బుల్లెట్ బైక్‌లు, ఓ స్కూటీ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ ఆధ్వర్యంలో టీమ్ వాటిని గుర్తించి స్వాధీనం చేసుకుంది. అలాగే నిందుతులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు.
Also Read: భూమిపైకి శుభాంశు శుక్లా.. అంతరిక్షంలో 60 రకాల ప్రయోగాలు
ఇది కూడా చూడండి: Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
robbery | Andhra Pradesh | rtv-news | telugu-news