Delhi AI Summit: మరీ ఇంత దిగజారిపోయారా.. ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో దొంగతనం

దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. భారీ భద్రత మధ్య జరుగుతున్న ఈ సదస్సులో దొంగతనం జరగడం కలకలం రేపింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'నియోసేపియన్'.

New Update
Bengaluru founder’s product stolen at Delhi AI summit

Bengaluru founder’s product stolen at Delhi AI summit

దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌(Delhi AI Summit) జరుగుతోన్న సంగతి తెలిసిందే. భారీ భద్రత మధ్య జరుగుతున్న ఈ సదస్సులో దొంగతనం(robbery) జరగడం కలకలం రేపింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'నియోసేపియన్' తమ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు అక్కడ ఓ స్టాల్‌ ఏర్పాటు చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆ వస్తువులను దొంగిలించారు. 

అసలేం జరిగింది?

ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఫిబ్రవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భద్రతా కారణాల వల్ల ఎగ్జిబిషన్ హాల్‌ను ఖాళీ చేయాలని సెక్యూరిటీ సిబ్బంది ఆదేశించారు. ఈ విషయాన్ని నియోసేపియన్ కో-ఫౌండర్, సీఈఓ ధనంజయ్ తన అనుభవాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హాల్‌ ఖాళీ చేయించే సమయంలో తమ AI వేరబుల్స్‌ను వెంట తీసుకెళ్లాలా అని ధనుంజయ్ సిబ్బందిని అడిగారు. దీనికి సిబ్బంది.. ఇతరులు కూడా తమ ల్యాప్‌టాప్‌లు ఇక్కడ వదిలేసి వెళ్తున్నారని.. వీటి భద్రత తమదేనని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ పర్యటన ముగిసేదాకా దాదాపు 6 గంటలు హాల్‌ లోపలికి వచ్చేందుకు ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు. 

Also read: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే

సాయంత్రం 6.30 గంటలకు ధనంజయ్‌ వచ్చి చూడగా స్టాల్‌ వద్ద ఖాళీ బాక్సులు మాత్రమే కనిపించాయి. వాళ్ల కంపెనీ తయారుచేసిన అత్యాధునిక ఏఐ వస్తువులను దొంగతనానికి గురయ్యాయి. ఈ ఘటనపై సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "మనకు ఏఐ సమ్మిట్ కంటే 'సివిక్ సెన్స్ సమ్మిట్ అవసరం అంటూ ఓ యూజర్ విమర్శించారు. విదేశీ ఇన్వెస్టర్ల ముందు మన దేశ ప్రతిష్టను దెబ్బయడమేనని మరికొందరు తిట్టిపోస్తున్నారు. 

ఈ ఘటనపై ధనంజయ్‌ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఏఐ పరికరాలు ప్రధానికి చూపించాలనే ఉత్సాహంతో తీసుకొచ్చిన తమకు చేధు అనుభవం ఎదురైందని ధనంజయ్ వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేస్తున్నారు. 

Also Read: బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్ :ఏడాదికి 2 ఇంజెక్షన్లు చాలు.. ఇక ట్యాబ్లెట్లు బంద్!

Advertisment
తాజా కథనాలు