Delhi Robbery: పట్టపగలు నడిరోడ్డుపై దోపిడీ.. దేశ రాజధానిలో రూ.కోటి నగలు చోరీ

దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. నగలు ధరించి ఎవరైనా కనపడితే చాలు నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవలకాలంలో రాజధాని నగరంలో రెట్టింపు అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.  

New Update
Daylight robbery on the main road..

Daylight robbery on the main road..

దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. నగలు ధరించి ఎవరైనా కనపడితే చాలు నిలువుదోపిడీ(robbery) చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవలకాలంలో రాజధాని నగరంలో రెట్టింపు అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.  పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలను షాపులో ఇచ్చేందుకు వెళ్తుండగా దారి కాచి మరీ వాటిని దోచేశారు దోపిడీ దొంగలు. ఈ ఘటనతో రాజధాని వాసుల్లో ఆందోళన మొదలైంది.  దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే ఈ  దోపిడీ జరగడం కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్‌ మండపం సమీపంలో కొందరు దొంగలు  దారికాచి రూ.కోటి విలువ చేసే నగలను దోచుకెళ్లడం సంచలనంగా మారింది. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు  పోలీసులు తెలిపారు. 

Also Read :  పుణె యూనివర్సిటీకి రూ.2.46 కోట్ల కుచ్చుటోపీ.. తెలుగు ఇంజినీర్‌ అరెస్టు

Daylight Robbery Of Jewelry

ఈ ఘటనకు సంపాదించి పోలీసులు ఇచ్చి సమాచారం మేరకు ఢిల్లీ కి చెందిన శివమ్‌కుమార్‌ యాదవ్‌, రాఘవ్‌ బంగారు ఆభరణాలను తయారు చేసి అవసరమైన షాపులకు సరాఫరా చేస్తుంటారు. ఎప్పటిలాగే నగలున్న బ్యాగులను తీసుకుని వారు తమ స్కూటర్‌పై చాందినీ చౌక్‌ నుంచి భైరాన్‌ మందిర్‌కు బయల్దేరినట్లు తెలిసింది. సమీపంలోని నగల దుకాణంలో వీటిని ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు దుండుగులు బైక్‌పై వచ్చి వారిని అడ్డుకున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే తుపాకీతో వారిని  బెదిరించి వారి వద్ద ఉన్న నగల బ్యాగులను లాగేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

వెంటనే తేరుకున్న బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల కోసం వారు గాలింపు చేపట్టారు. కాగా బాధితుల నుంచి 500 గ్రాముల బంగారం, దాదాపు 35 కిలోల వెండి ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.కోటి పైనే ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు