తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులకు శ్రీకారం
సంక్రాంతి తర్వాత నుంచే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కొత్తగా 36 లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. అలాగే రేషన్ కార్డులపై ఓ కమిటీ వేసి ఇకపై సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.