Ration Cards : 15 లక్షల రేషన్ కార్డులు రద్దు?

TG: రాష్ట్రంలో సుమారు 15 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసే ఆలోచలనో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ–కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా గుర్తించింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది.

author-image
By V.J Reddy
New Update
TG Ration Cards Ban

Ration Cards: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 15 లక్షల రేషన్‌ కార్డులు రద్దు చేయాలని భావిస్తోంది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోని వారందరినీ అనర్హులుగా గుర్తించనున్నట్లు సమాచారం.  వారి రేషన్ కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం  నిర్ణయం తీసుకున్నట్లు తెల్సుతోంది.  

ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉండేలా చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం రాష్ట్ర మొత్తం జనాభా 3.83 కోట్లు ఉండగా..  89.96 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 89.96 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా  గత పదేళ్లుగా ప్రభుత్వం అర్హులకు రేషన్ కార్డు లు మంజూరు చేయలేదు.

Also Read :  నేటి నుంచి గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి

మాకెందుకులే అనుకున్నారేమో?

గతం లో అర్హతలను పూర్తి గా విచారించకుండానే రేషన్ కార్డులను ప్రభుత్వాలు జారీ చేశాయి. దీని వల్ల అనర్హులకు కూడా తెల్ల రేషన్ కార్డులు వచ్చాయి. వ్యక్తులు లేకున్నా వారి పేరు పై రేషన్ కార్డులు ఉన్నాయనే ఆరోపణలు కూడా త ర చూ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అనర్హులను గుర్తించేందుకు గతేడాది ఆక్టోబర్ నెలలో నుంచి  ఈ–కేవైసీ విధానాన్ని చేపట్టింది. అయితే.. ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు దాదాపు ఆరు సార్లు సమయం పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. 

ఈ ఏడాది మార్చి లో ఈ ప్రక్రియకు ముగింపు పెట్టింది. కాగా ఆరు నెలల సమయం ఇచ్చిన దాదాపు 15 లక్షల మంది ఈ–కేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ–కేవైసీ చేసుకొని అందరిని రేషన్ కార్డు జాబితా నుంచి తొలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాటన్నిటి రద్దు చేసేందుకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచినట్లు తెలుస్తోంది.

Also Read :  ఏపీలో తొలి వందే మెట్రో...ఏ రూట్లో పరుగులు పెడుతుందంటే!

Also Read :  బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Also Read :  ఒంటిగంట వరకు ఫుడ్ స్టాల్స్..తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Advertisment
Advertisment
తాజా కథనాలు