/rtv/media/media_files/2024/11/20/VkfksnStiHyMREid6iTB.jpg)
దేశంలో డిజిటలైజేషన్ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ వ్యవస్థ ద్వారా దేశంలో మొత్తంగా 80.60 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. అయితే ఆధార్ ధ్రవీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలిగిపోయినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకు మొత్తంగా 20.4 కోట్ల రేషన్ కార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది.
Also Read: ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిదే అధికారం: యాక్సిస్ మై ఇండియా
దేశంలో మొత్తంగా 5.33 లక్షల చౌకధరల దుకాణాలకు ఈపోస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో 99.8 శాతం కార్డులను ఆధార్‌తో లింక్ చేయగా.. 98.7 శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయ్యింది. మరోవైపు ఈకేవైసీ ప్రక్రియతో ఇప్పటిదాకా 64 శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ కూడా పూర్తయ్యింది.
Also Read: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే!
మరోవైపు ఆహార పదార్థాల సరఫరా విషయంలో కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పకడ్బందీగా పనిచేస్తోందని కేంద్రం చెప్పింది. సరకు రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను రైల్వేశాఖతో లింక్ చేసినట్లు పేర్కొంది. ఇక వన్ నేషన్-వన్ రేషన్ కార్డు స్కీమ్‌తో లబ్ధిదారుల దేశంలో ఎక్కడైనా కూడా సరకులు తీసుకునే ఛాన్స్ కలిగిందని స్పష్టం చేసింది.
Also Read: పోలింగ్ బూత్ దగ్గర విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతి
Also Read: గ్యాంగ్‌స్టర్లకు రాజధానిగా ఢిల్లీ.. సీఎం అతిశీ సంచలన వ్యాఖ్యలు