కొత్త రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఈ అర్హతలు ఉంటేనే?

తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 నుంచి రేషన్ కార్డులు జారీ చేయనుంది. గతంలో రూరల్‌లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాలో రూ.2 లక్షల ఆదాయం కంటే తక్కువగా ఉన్నవారికే ఇచ్చేవారు. మరి ఈ ఆదాయాన్ని పెంచుతారో? లేదో? చూడాలి.

New Update
TS New Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుకు ఎదురుచూస్తున్న వారికి షాక్.. అప్లికేషన్లు మరింత ఆలస్యం.. కారణమిదే!

Ration cards

తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కొత్త పేర్లు చేర్చుకోవడం, పేర్లు మార్పులు వంటి వాటికి కూడా ప్రభుత్వం అనుమిస్తోంది. అయితే కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునేవారు తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి.

ఇది కూడా చూడండి: TS:  గ్రామ సభల్లో రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణ

ఆధార్ కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్..

పెళ్లయిన వారు కొత్త కార్డులకు అప్లై చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పాటు ఆధార్ కార్డు కూడా ఉండాలి. కొత్తగా ఎవరైనా పేర్లు చేర్చుకోవాలంటే వారి ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్‌ ఉండాలి. ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకుని మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోవాలి. రేషన్ కార్డుకి మీరు అర్హులు అనుకుంటేనే జారీ చేయనున్నారు. అయితే ప్రజల ఆదాయం బట్టి మాత్రమే రేషన్ కార్డులను మంజూరు చేస్తారు.

ఇది కూడా చూడండి:AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి

ఇప్పటి వరకు రూరల్‌లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాలో రూ.2 లక్షల్లోపు ఆదాయం కంటే తక్కువగా, భూమి 3.5, మాగాణి 7.5 ఎకరాలు ఉంటేనే కార్డులు జారీ చేసేవారు. మరి ఈసారి ఏమైనా మార్పులు చేస్తారో లేదో చూడాలి. తెలంగాణలో మొత్తం మూడు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. ఒకటి అంత్యోదయ ఆహార భద్రత కార్డు, ఆహార భద్రత కార్డు, అంత్యోదయ అన్న యోజన కార్డులు అనేవి ఉన్నాయి. మొదటి రకంలో 6 కిలోల బియ్యం, రెండో రకం కార్డులకు 10 కిలోల బియ్యం, మూడో రకం కార్డులకు 35 కిలోల బియ్యం ఇస్తున్నారు. 

ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్!

ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు