Ration Cards: జనవరి నుంచే కొత్త రేషన్ కార్డులు.. ఫస్ట్ ఇచ్చేది వారికే!

ఏపీలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాల అధికారులు పనులు మొదలు పెట్టారు. 1.5 లక్షలకుపైగా పేద కుటుంబాలకు జనవరిలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటుంది.

New Update
ration

AP Ration Cards

ఏపీలో ప్రస్తుతం 1.48కోట్ల రేషన్‌ కార్డులు ఉండగా...అందులో 90 లక్షల కార్డులను జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం గుర్తించింది.  ప్రస్తుతం వాటికి మాత్రమే ఉచిత బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరుకులపై రాయితీ లభిస్తోంది. మిగిలిన కార్డులకు ఉచిత బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, రాగులు తదితర సరుకులపై ఇస్తున్న సబ్సిడీకి అయ్యే ఆర్థిక భారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read: మాకు అన్యాయం చేయొద్దు.. TGPSC ఛైర్మెన్ కు group-1 అభ్యర్థుల కీలక వినతి

 పీహెచ్‌హెచ్‌(ప్రయారిటీ హౌస్‌హోల్డ్‌) రేషన్‌కార్డులను కూడా ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఆర్థికభారం పడకూడదని  కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాల అధికారులు పనులు మొదలు పెట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం రేషన్‌కార్డుల వినియోగంపై కాలానుగుణ సమీక్షలు చేస్తున్నారు. 

Also Read:  ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ శుభవార్త

ఆ సార్టింగ్‌ డేటా ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని 17,941 అంత్యోదయ అన్న యోజన(ఏఏవై), మరో 1,36,420 పీహెచ్‌హెచ్‌ కార్డుదారులు గత ఆరు నెలలుగా రేషన్‌ సరుకులు తీసుకోవడం లేదని అధికారులు ఈ సర్వేలో గుర్తించారు. ఆ కార్డులను తొలగిస్తే ఏడాదికి రూ.90 కోట్ల వరకు ఆదా అవుతుందని తెలుస్తుంది. వాటి స్థానంలో అర్హులైనవారికి కొత్త కార్డులు మంజూరు చేయవచ్చని పౌరసరఫరాలశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపింది. 

Also Read:  రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి!

ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారమూ పడకుండానే 1.5 లక్షలకుపైగా పేద కుటుంబాలకు జనవరిలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటుంది. అయితే దీనికి ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది.

Also Read:  హైదరాబాద్ కస్టమర్‌ను చీట్ చేసిన స్విగ్గీ.. జరిమానా ఎంతో తెలుసా!?

దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలో అర్హత కలిగిన పేదలందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయబోతుంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌కార్డులు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న కార్డులను రీ డిజైన్‌ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ సరికొత్త డిజైన్‌తో అందజేసేందుకు కసరత్తును మొదలు పెట్టింది.

రేషన్‌కార్డుల రూపకల్పన, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా అర్హులైన పేదలకు కొత్త కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ రెడీ అవుతుంది. కొత్తకార్డులకు అధికారులు డిజైన్లు పరిశీలిస్తున్నారు. వాటిలో లేత పసుపు రంగు కార్డుపై రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించిన నమూనాను ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. గత వైసీపీ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని గొప్పలు చెప్పింది. దరఖాస్తు చేసుకున్న వారికి ఐదు రోజుల్లోనే మంజూరు చేస్తామంటూ ఆర్భాటం చేసింది. 

దీంతో  రకరకాల కారణాలతో రేషన్‌కార్డు లేనివారు వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దాంతో గత ప్రభుత్వంలో కొత్తకార్డుల కోసం వచ్చిన 30,611 దరఖాస్తులతోపాటు స్ల్పిట్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు 46,918, ఉన్న కార్డుల్లో సభ్యుల చేర్పుల కోసం వచ్చినవి 2,13,007 దరఖాస్తులు, తొలగింపు కోసం వచ్చినవి 36,588, అడ్రస్‌ మార్పు కోసం వచ్చిన 8,263, కార్డుల సరెండర్‌ కోసం వచ్చినవి 685 కలిపి మొత్తం 3,36,072 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు