రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత నుంచే కొత్త రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టనుంది. కొత్తగా 36 లక్షల రేషన్ కార్డుల జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అలాగే ఇకపై రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. #Hyderabad--Updates from #Telangana Legislative Council Minister for Civil Supplies @UttamINC has announced that new 'Smart Ration Cards' would be issued to the eligible public from Post #Sankranti.Selection of beneficiaries would be done based on the caste census survey… pic.twitter.com/wBRdsvfX74 — NewsMeter (@NewsMeter_In) December 16, 2024 ఇది కూడా చూడండి: 'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్ అర్హులైన ప్రతీ ఒక్కరికి.. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. సంక్రాంతి నుంచే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 36 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇది కూడా చూడండి: పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్! ఇది కూడా చూడండి: Rachakonda CP: మంచు ఫ్యామిలీపై మొత్తం 3 కేసులు.. సీపీ కీలక ప్రకటన!