భారత రక్షణ రంగంలో కీలక నిర్ణయం
రక్షణ రంగంలో 10 ప్రతిపాదలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.05 లక్షల కోట్లతో డిఫెన్స్ రంగాన్ని పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందించింది.
రక్షణ రంగంలో 10 ప్రతిపాదలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.05 లక్షల కోట్లతో డిఫెన్స్ రంగాన్ని పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందించింది.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం, పాకిస్తాన్ మధ్య పోలికను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య తల్లిగా గుర్తిస్తే.. పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదానికి తండ్రిగా మారిందని ఆయన అన్నారు.
పాకిస్తాన్‌లోని న్యూక్లియర్ వెపన్స్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది భారత్. ఈ మేరకు IAEAకు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పాకిస్తాన్ ఓ పనికి మాలిన దేశమన్న ఆయన అలాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్నారు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. అణు బెదిరింపులకు లొంగేది లేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి ఏంటో తెలియజేశామన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి ఉపయోగించామని యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో నేడు బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్‌గా దాన్ని ప్రారంభించారు.
భారత్-పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. త్రివిధ దళాల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో భద్రతా దృష్ట్యా పరిస్థితులను అంచనా వేయడానికి ఏర్పాటు చేశారు.