Rajnath Singh : ఇది ట్రైలరే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్

పొరుగు దేశంపాకిస్థాన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్‌లోని ప్రతీ ఇంచు భూమి బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పరిధిలోనే ఉందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని చెప్పారు.

New Update
rajanath singh

పొరుగు దేశంపాకిస్థాన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(rajnath-singh) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్‌లోని ప్రతీ ఇంచు భూమి బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పరిధిలోనే ఉందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని చెప్పారు.  ఆ ట్రైలర్ నుంచే పాకిస్తాన్‌కు అర్థమైందని,  భారత్ పాకిస్తాన్‌కు జన్మనివ్వగలిగినప్పుడు, అది ఇంకేం చేయగలదో తాను చెప్పాల్సిన అవసరం లేదన్నారు. లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారైన తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు విజయం ఒక హాబీగా మారిందన్న రాజ్‌నాథ్‌ సింగ్‌..  అందుకు నిదర్శనమే ఆపరేషన్‌ సింధూర్‌ అని తెలిపారు.

Also Read :  ఢిల్లీ MP క్వార్టర్స్‌లో అగ్ని ప్రమాదం

Also Read :  మంటల్లో కాలిబూడిదైన ట్రైన్.. గజగజ వణికిపోయిన ప్రయాణికులు

ఆపరేషన్‌ సింధూర్‌లో బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌ది కీలక పాత్ర

ఆపరేషన్‌ సింధూర్‌(operation sindhoor) లో బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌(brahmos missile in pakistan)ది కీలక పాత్ర అని చెప్పారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాయని తెలిపారు.  బ్రహ్మోస్ అనేది కేవలం ఒక క్షిపణి కాదని, వేగం, ఖచ్చితత్వం, శక్తి కలగలిపిన ఈ క్షిపణి వ్యవస్థ భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు వెన్నెముకగా మారిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్నో సైట్ నుండి దాదాపు 100 క్షిపణులను ప్రయోగిస్తామని, వాటిని మూడు సేవలకు సరఫరా చేస్తామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. బ్రహ్మోస్ క్షిపణుల శక్తి గురించి తెలియని వారు పాకిస్తాన్‌ను అడిగి తెలుసుకోవాలని యోగి వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు