/rtv/media/media_files/2025/07/28/defence-minister-rajnath-singh-initiates-debate-on-operation-sindoor-in-lok-sabha-2025-07-28-16-15-37.jpg)
Defence Minister Rajnath Singh Initiates Debate On Operation Sindoor In Lok Sabha
లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆపరేషన్ సింధూర్‌పై చర్చలు జరిగాయి. ఉదయ 11 గంటలకు సభ ప్రారంభం కాగా అధికార, విపక్షాల మధ్య గందరగోళం నెలకొంది. దీంతో వరుసగా సభ మూడుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి మధ్యహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. '' ఆపరేషన్ సిందూర్‌లో వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7న రాత్రి పీవోకే, పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు జరిపింది. 7 ఉగ్ర శిబిరాలను సైన్యం ధ్వంసం చేసింది. కేవలం 22 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ పూర్తయ్యింది. ఆపరేషన్ సిందూర్ అనేది మన సైన్యం వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక.
Also Read: ‘ఆపరేషన్ మహదేవ్’.. పహల్గాం ఉగ్రవాదులను ఎలా లేపేసారో తెలుసా ?
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ మనపై దాడికి దిగింది. అయినప్పటికీ ఆ దాడులను మనం సమర్థవంతంగా తిప్పికొట్టాం. భారత దాడులను చాలా దేశాలు సపోర్ట్ చేశాయి. సరిహద్దులు దాటి వెళ్లడమనేది ఆపరేషన్ సిందూర్ టార్గెట్ కాదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే మా టార్గెట్. మన దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. దీంతో పాక్ డీజీఎంవో వెంటనే మనకు ఫోన్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మన సైనికుల వీరత్వం కనిపించింది. నేను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సైనిక సత్తాను విపక్షాలు ప్రశ్నించడం సరికాదు.
Also Read: బ్యాంకాక్‌లో దారుణం.. స్థానికులపై కాల్పులు, ఆరుగురు మృతి
1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు అడిగాయో తెలుసుకోండి. ఆ సమయంలో విపక్ష సభ్యులు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి మాత్రమే ప్రశ్నించాయి. ఆపరేషన్ సిందూర్ జరిగిన తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ అధికారులు పాల్గొనడం మనమందరం చూశాం. దీన్నిబట్టి చూస్తే ఆ దేశం ఉగ్రవాదులను ఎలా పెంచి పోషిస్తో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం ఎవరిపై కూడా దాడి చేయలే. పాక్ చరిత్ర, అక్కడి ఉగ్రవాదం గురించి తెలుసుకుని మాట్లాడాలి. మన ప్రజలను చంపుతుంటే భారత సైన్యం చూస్తూ ఊరుకోదు. పాకిస్థాన్ ప్రేరిపిస్తున్న ఉగ్రవాదం ఆ దేశానికే ఇబ్బందికరంగా మారుతుందని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.