Delhi Blast: ఢిల్లీ పేలుళ్లు.. వారిని వదిలిపెట్టం.. ప్రధాని మోదీ, రాజ్‎నాథ్ సింగ్ సంచలన వార్నింగ్!

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన పేలుళ్లు ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ పేలుళ్లకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలిపారు.

New Update
Delhi bomb blast

Delhi bomb blast

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన పేలుళ్లు ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ పేలుళ్లకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని, వారిని చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. అలాగే ఈ పేలుళ్లలో మృతి చెందినవారందరికీ కూడా తన ప్రగాడ సంతాపాన్ని ప్రధాన మోదీ తెలిపారు. ఈ పేలుళ్లకు గల కారణాలను అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారని తెలిపారు. ఇందులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చూడండి: Delhi Blast Incident: డిల్లీ పేలుడు కేసులో కీలక పరిణామం: అదుపులోకి ఉమర్ కుటుంబ సభ్యులు!

ఇది కూడా చూడండి: Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ!

Advertisment
తాజా కథనాలు