మారుతున్న పరిణామాలు.. అమెరికా, భారత్‌ మధ్య కీలక ఒప్పందం

అమెరికా-భారత్‌ మధ్య సంబంధాలు మళ్లీ బలపడనున్నాయి. శుక్రవారం ఇరుదేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం ఉండనుంది. ఇది ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది.

New Update
India, USA Signs 10 Year Defence Framework In Malaysia

India, USA Signs 10 Year Defence Framework In Malaysia

భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించిన అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా-భారత్‌ మధ్య సంబంధాలు మళ్లీ బలపడనున్నాయి. శుక్రవారం ఇరుదేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం ఉండనుంది. ఇది ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. 

Also Read: కోటి ఉద్యోగాలు ఇస్తాం.. బీహార్‌ ఎన్నికల కోసం ఎన్డీయే మ్యానిఫెస్టో!

ఇక వివరాల్లోకి వెళ్తే మలేసియాలో ఆసియన్ రక్షణ మంత్రుల సమావేశం నిర్వహించారు. అక్కడ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అలాగే అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్‌ సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే వాళ్లు రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ మేరకు హెగ్సెత్‌ ఎక్స్‌లో దీని గురించి పోస్ట్ చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌తో10 ఏళ్ల రక్షణ ఒప్పందంపై సంతకం చేసేందుకు సమావేశం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 

Also Read: అమెరికా నుంచి 2790 మంది భారతీయుల బహిష్కరణ..కేంద్రం వెల్లడి

ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. సమన్వయం, సమాచారం, సహాకారం పెంపొందించుకుంటామని.. ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.  మరోవైపు ఈ సమావేశంలో రాజ్‌నాథ్‌ సింగ్, హెగ్సేత్‌ల మధ్య పలు ఇతర అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం.  

Also Read: కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్..ప్రకటించిన టర్కీ

Advertisment
తాజా కథనాలు