పుతిన్‌ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య వారం పాటు కాల్పుల విరమణ జరగనుంది. తన ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించాడని ట్రంప్‌ పేర్కొన్నారు.

New Update
FotoJet Russian President Vladimir Putin  Agreed To Not Attack Ukraine For A Week,says Trump53)

Russian President Vladimir Putin Agreed To Not Attack Ukraine For A Week,says Trump

2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ట్రంప్‌ కూడా ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య వారం పాటు కాల్పుల విరమణ జరగనుంది. తన ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించాడని ట్రంప్‌ పేర్కొన్నారు. వారం రోజులు సీజ్‌ఫైర్‌ ప్రకటించడానికి ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే ప్రస్తుతం ఉక్రెయిన్‌లో తీవ్రంగా చలి ఉంది. భారీగా మంచు కురుస్తోంది.

Also Read: సైబర్ నేరాలు.. కోటిన్నర మొబైల్‌ నంబర్లు బ్లాక్‌ చేసిన కేంద్రం

అక్కడ ప్రధాన నగరాలైన కీవ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. చలి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపాలని తాను పుతిన్‌ను కోరినట్లు ట్రంప్‌ చెప్పారు. ఈ ప్రతిపాదనకు పుతిన్‌ ఒప్పుకున్నాడని.. వారం రోజుల పాటు యుద్ధం చేయనని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పుతిన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. అంతేకాదు రెండో దశ శాంతి చర్చలకు సంబంధించి కూడా పుతిన్‌తో మాట్లాడినట్లు చెప్పారు.  

Also Read: ఇమ్రాన్‌ ఖాన్‌కు సీరియస్‌.. జైల్లోనే హతమార్చే కుట్ర.. అసలేం జరుగుతోంది?

అయితే ట్రంప్ ప్రతిపాదనను మాత్రం రష్యా అధికారికంగా ప్రకటించలేదు. కాల్పుల విరమణ కుదిరినట్లు చెప్పలేదు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దీనిపై మాట్లాడారు. ఇరుదేశారు ఎనర్జీ సీజ్‌ఫైర్ పాటించాలని కోరారు. దీని అర్థం రెండు దేశాలు కూడా విద్యుత్, ఆయిల్ ఉత్పిత్తి చేసే ప్రదేశాలపై దాడులు చేసుకోకూడదు. శక్తి, ఇంధన వనరులపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వల్ల ఇరు దేశాలు అంధకారంలోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదన చేశారు. రష్యా మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. 

Advertisment
తాజా కథనాలు