పుతిన్‌ని కూడా మదురోలాగే బంధిస్తారా? ట్రంప్ షాకింగ్ కామెంట్లు

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా దళాలు బంధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సహా పలువురు నేతలు పుతిన్‌పై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి అవసరం లేదని ట్రంప్ చెప్పారు. 

New Update
Putin did not mention Trump's name in SCO meeting, Praises Modi and jinping

Putin did not mention Trump's name in SCO meeting, Praises Modi and jinping

రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా దళాలు బంధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సహా పలువురు నేతలు పుతిన్‌పై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రస్తుతానికి పుతిన్‌ని బంధించాల్సిన అవసరం లేదని  ట్రంప్ అన్నారు. 

పుతిన్ భయం అమెరికా అంటేనే..

ఒక మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఐరోపా దేశాలంటే భయం లేదని, కేవలం తన నాయకత్వంలోని అమెరికా అంటేనే భయమని చెప్పుకొచ్చారు. "పుతిన్ ఐరోపాకు భయపడడు. నా నాయకత్వంలోని అమెరికా అంటేనే అతడికి భయం. మేం ఎప్పుడూ గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాం" అని ట్రంప్ తెలిపారు.

జెలెన్స్కీ వ్యాఖ్యలపై స్పందన

మదురోను బంధించిన తర్వాత జెలెన్స్కీ మాట్లాడుతూ, "నియంతలతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు తెలుసు, నెక్స్ట్ ఏం చేయాలో కూడా వారికి తెలుసు" అని పుతిన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, పుతిన్ విషయంలో అలాంటి సైనిక చర్య అవసరం లేదని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగియకపోవడంపై తాను తీవ్ర నిరాశతో ఉన్నానని, ఇప్పటికే ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

పుతిన్‌ను బంధీ చేయడం సాధ్యమేనా?

జనవరి 3, 2026న అమెరికా దళాలు వెనిజులా రాజధాని కరాకస్‌పై మెరుపు దాడి చేసి మదురోను, ఆయన భార్యను బంధించి న్యూయార్క్‌కు తరలించాయి. ఇలాంటిది రష్యా విషయంలో జరగదని నిఫుణులు చెబుతున్నారు. ఎందుకంటే పుతిన్ ఓ అగ్రరాజ్యానికి అధిపతి. అంతేకాదు రష్యా దగ్గర భారీ అణు ఆయుధాలు ఉండటంతో ఆయనపై ఇలాంటి ప్లాన్ వర్కౌంట్ కాదని అభిప్రాయపడుతున్నారు. రష్యా, అమెరికాకు ఏమాత్రం తీసిపోదు.

Advertisment
తాజా కథనాలు