/rtv/media/media_files/2025/12/09/trump-putin-zelen-2025-12-09-18-42-35.jpg)
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(america president donald trump) ఎంత పట్టుదలగా ఉన్నా అది ముందుకు సాగడం లేదు. రీసెంట్ రెండు దేశాల కోసం ట్రంప్ 28 సూత్రాలతో శాంతి ప్రణాళికను కూడా రూపొందించారు. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) ఒప్పుకున్నారు.కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ(zelenskyy) మాత్రం అంగీకరించడం లేదు. ఈ విషాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రకటించారు. తన ప్రణాళికకు మాస్కో ఆమోదం తెలిపిందని.. అయితే కైవ్ మాత్రం ఇంకా అంగీకరించడానికి సిద్ధంగా లేదని ట్రంప్ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొంచెం సులభంగా ముగుస్తుందని నేను అనుకున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా అది సులభం కావడం లేదు అంటూ వ్యాఖ్యానించారు.
Also Read : మరో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!
చాలా నిరాశగా ఉంది..
రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇద్దరితోనూ తాను మాట్లాడానని..కానీ జెలెన్ నుంచి ఎటువంటి ప్రతిసపందనా లేదని ట్రంప్ చెప్పారు. తన ప్రతిపాదనతో ష్య సుముఖంగానే ఉంది కానీ జెన్ స్కీ మాత్రం దీనికి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు కచ్చితంగా తెలియదని చెప్పారు. ఉక్రెయిన్ ప్రజలు తన ప్రణాళికను ఇష్టపడుతున్నారని..కానీ అధ్యక్షుడు మాత్రం సిద్ధంగా లేరని అన్నారు. జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదనను ఇంకా చదవకపోవడంనిరాశ కలిగించిందని ట్రంప్ చెప్పారు. గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యూఎస్ అధికారి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లతో క్రెమ్లిన్‌లో సమావేశం అయ్యారు. ఇందులో పుతిన్ యుద్ధాన్ని ముగించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చారు.
Also Read : తెలంగాణకు ట్రంప్ బంపరాఫర్.. ఏకంగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!
భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేము..
ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికను చూసుకుంటే ఉక్రెయిన్.. క్రిమియా, డాన్‌బాస్, లుహాన్స్క్‌తో సహా ఖేర్సన్, జపోరిజియాలో కొంత భూభాగాన్ని రష్యాకు అప్పగించాలి. భవిష్యత్తులో ఎట్టిపరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరొద్దు. రష్యా నుంచి ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు ఇచ్చినందుకు గాను అమెరికాకు పరిహారం తీసుకుంటుంది. ఒకవేళ రష్యాపై ఉక్రెయిన్ దాడి చేస్తే ఈ హామీలు రద్దు అవుతాయి. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రష్యాను తిరిగి విలీనం చేసేందుకు, దశలవారీగా ఆంక్షలను ఎత్తివేయాలి. చమురు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు వంటి పరస్పర ప్రయోజనం ఉండే రంగాల్లో అమెరికా రష్యాతో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం.. అలాగే G8 కూటమిలో రష్యాను తిరిగి చేరేందుకు అవకాశం కల్పించడం లాంటి ప్రతిపాదనలు అమెరికా రూపొందించింది. ఇందులో తమ భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా వదులుకునేది లేదని జెలెన్‌స్కీ ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. ఇప్పుడు కూడా జెలెన్‌స్కీ మళ్లీ అదే చెబుతున్నారు. రష్యాకు తమ భూభాగాన్ని ఇవ్వడం అంటే దేశ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని ఆయన భావిస్తున్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనే నిబంధనకు కూడా జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది తమ భవిష్యత్తు భద్రతకు ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. నాటోలో చేరితే రష్యా నుంచి శాశ్వత భద్రతను అందిస్తుందని భావిస్తున్నారు.
Follow Us