/rtv/media/media_files/2025/12/29/trump-during-zelensky-meet-2025-12-29-10-15-43.jpg)
No Deadline, Focus On Ending Ukraine War, Trump During Zelensky Meet
నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine War) ఇంకా జరుగుతూనే ఉంది. దీనికి ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్(Donald Trump), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(zelenskyy) భేటీ అయ్యారు. ఫ్లోరిడా ఎస్టేట్స్‌కు చేరుకున్న జెలెన్‌స్కీకి ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తుది గడువు ఏమి లేదన్నారు. యుద్ధం ముగింపు పైనే ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.
దౌత్య ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. అంతేకాదు రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) తో తాను ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. ఈ అంశంలో ఫలితం సాధించే దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. '' రష్యా, ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటున్నాయి. నేను జెలెన్‌స్కీతో సమావేశం కావడంపై పుతిన్ చిత్తశుద్ధితో ఉన్నారు. తుది గడువు అనేది ఏమీ లేదు. యుద్ధం ముగింపు పైనే ఫోకస్ పెడుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితులపై జెలెన్‌స్కీ, పుతిన్ ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
Also read: మంచు దుప్పటి కప్పుకున్న నగరం.... కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
Trump During Zelensky Meet
రష్యా, ఉక్రెయిన్ వార్ వల్ల ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా 8 యుద్ధాలు ఆపాను. ఇది చాలా కష్టతరమైంది. ఫ్లోరిడాలో మీటింగ్ కోసం జెలెన్‌స్కీ ఎంతో కృషి చేశారు. ఆయన, ఉక్రెయిన్ ప్రజలకు ఎంతో ధైర్యం ఉంది. ఉక్రెయిన్, రష్యా పరిస్థితులపై చర్చలు కొనసాగిస్తుంటాం. చివరి దశలో చర్చలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దామని'' ట్రంప్ అన్నారు.
ట్రంప్‌తో జరిగే మీటింగ్‌లో ఉక్రెయిన్ భద్రతా హామీల అంశాన్ని లేవనెత్తుతానని ఇప్పటికే జెలెన్‌స్కీ క్లారిటీ ఇచ్చారు. 20 సూత్రాల ప్లాన్‌పై చర్చలు జరుపుతామని.. ఇది 90 దాదాపు 90 శాతం రెడీ అయినట్లు పేర్కొన్నారు. ఈ మీటింగ్‌లో ఉక్రెయిన్, అమెరికా మాత్రమే కాక యూరప్ దేశాలు కూడా ఈ విషయంలో పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
Also Read: సిగరెట్ తాగేవారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిపోనున్న ధరలు!
Follow Us