Zelensky : పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టారు: జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ బీబీసీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే అనధికారికంగా మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేశారని ఆయన హెచ్చరించారు.

New Update
russia

ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ బీబీసీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా(russia) అధ్యక్షుడు పుతిన్(putin) అప్పుడే అనధికారికంగా మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేశారని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు పుతిన్‌ను అడ్డుకోకపోతే ఈ యుద్ధం ఇంకా ఎంత దూరం వెళ్తుందో, ఆయన ఎంత భూభాగాన్ని ఆక్రమిస్తారో ఊహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ చూపిస్తున్న ప్రతిఘటనే ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విస్తరించకుండా ఆపుతోందని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

Also Read :  ఘోర ప్రమాదం: నదిలో పడ్డ బస్సు.. 18 మంది స్పాట్ డెడ్!

రష్యా పెడుతున్న డిమాండ్లను

శాంతి చర్చల పేరుతో రష్యా పెడుతున్న డిమాండ్లను జెలెన్‌స్కీ(zelensky) తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా వంటి ప్రాంతాల్లోని కొంత భూభాగాన్ని రష్యాకు వదిలేయాలన్న ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. ఇలా భూభాగాన్ని వదులుకోవడం అంటే అక్కడ నివసించే లక్షలాది మంది ప్రజలను అన్యాయం చేయడమేనని, ఇది దేశ భద్రతకు ప్రమాదకరమని ఆయన అన్నారు. ఒకవేళ ఇప్పుడు రష్యా మాట విని యుద్ధానికి విరామం ఇస్తే, మరో రెండేళ్ల తర్వాత వారు మరింత బలంతో మళ్లీ దాడికి వస్తారని, అందుకే ఇది పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి బలమైన భద్రతా హామీలు అవసరమని జెలెన్‌స్కీ కోరారు. ముఖ్యంగా అమెరికా కాంగ్రెస్ ద్వారా ఈ హామీలు రావాలని, ఎందుకంటే అక్కడ అధ్యక్షులు మారుతుంటారు కానీ వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయని ఆయన గుర్తు చేశారు. తమకు పేట్రియాట్ క్షిపణులు వంటి అధునాతన ఆయుధాల తయారీకి అనుమతులు ఇవ్వాలని, గగనతల రక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

దేశంలో ఎన్నికల నిర్వహణపై జెలెన్‌స్కీ స్పందిస్తూ, యుద్ధ సమయంలో ఎన్నికలు జరపాలంటే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. తాను మరోసారి పోటీ చేస్తానా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. అలాగే, గతంలో చెప్పినట్లుగానే కీలకమైన భూభాగాల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, అది కేవలం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఉక్రెయిన్ ప్రజలే నిర్ణయించాలని జెలెన్స్కీ మరోసారి స్పష్టం చేశారు.

Also Read :  మెక్సికో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి

Advertisment
తాజా కథనాలు