Russia-Ukraine: పుతిన్ ఇంటిపై దాడి..వీడియోలు విడుదల చేసిన రష్యా

 అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులు చేసిందని రష్యా ఆరోపణలు చేసింది. దీనిని ఉక్రెయిన్ ఖండించింది. కానీ తాజాగా దాడికి సంబంధించిన వీడియోలను రష్యా రక్షణ శాఖ బయటపెట్టింది. 

New Update
drones

ఉక్రెయిన్, రష్యా మధ్య నాలుగేళ్ల క్రితం మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్‌ దాడులు జరిగినట్లు ఆ దేశ రక్షణశాఖ ఆరోపించింది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపిస్తోంది. అయితే ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.  అమెరికా, ఉక్రెయిన్ చేసిన శాంతి ప్రయత్నాలను రష్యా ప్రమాదంలో పడేయాలని కోరుకుంటోందని తెలిపారు. కీవ్‌లోని అధికారిక నివాసంపై దాడి చేసేందుకు ఒక సాకు కోసం చూస్తోందని జెలెన్ స్కీ అన్నారు. 

వీడియో వెలుగులోకి..

అయితే పుతిన్ ఇంటిపై దాడికి సంబంధించిన దాడుల ఫోటోలను, వీడియోలను రష్యా రక్షణ శాఖ తాజాగా బయటపెట్టింది. అధ్యక్షుడి నివాసంపై ఉక్రెయిన్ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించిందని తెలిపింది. రష్యాలోని నోవ్‌గొరొడ్‌ ప్రాంతంలో పుతిన్‌ వ్యక్తిగత నివాసం ఉంది. సోమవారం తెల్లవారు ఝామున డ్రోన్లతో ఇంటిపై దాడికి ప్రయత్నించిందని రష్యా రక్షణశాఖ చెబుతోంది. ప్రయోగించిన డ్రోన్లను అన్నింటినీ నిర్వీర్యం చేశామని, నివాసానికి ఎటువంటి నష్టం కలగలేదని వివరించింది.  దీనికి బదులుగా ఉక్రెయిన్‌పై సరైన సమయంలో దాడిచేసే హక్కు తమకు ఉందని, శాంతి చర్చలకు విఘాతం కలిగించే దాడి అని విదేశాంగశాఖ మంత్రి లవ్రోవ్‌ హెచ్చరించారు. 

Advertisment
తాజా కథనాలు