Prabhas : వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. రూ. 2 కోట్లు..!
వయనాడ్ విపత్తు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. ఈ విపత్తులో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వయనాడ్ బాధితుల కోసం రూ. 2 కోట్లు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందించారు.