Pawan Kalyan - Faria Abdullah: పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేయాలనుంది.. క్రేజీ హీరోయిన్ హాట్ కామెంట్స్ - VIDEO

యాంకర్‌ సుమ ‘చాట్‌ షో’ కొత్త ఎపిసోడ్‌లో హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. ఇందులో పలు విషయాలు పంచుకుంది. తనకు అవకాశం వస్తే ఒకప్పటి పవన్‌తో డేటింగ్, యంగ్ నాగార్జునతో లవ్, ప్రభాస్‌ను మ్యారేజ్‌ చేసుకుంటానని తెలిపింది. ఈ షో ప్రోమో వైరలవుతోంది.

New Update
faria abdullah interesting comments on pawan kalyan

faria abdullah interesting comments on pawan kalyan

Pawan Kalyan - Faria Abdullah: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘జాతి రత్నాలు’ సినిమాలో లాయర్ పాత్రలో నటించి అదరగొట్టేసింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా.. అనుదీప్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఫరియా లెవెల్ మారిపోయింది. 

Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్‌తో రేప్ చేయిస్తావా..!

వరుస సినిమాలను లైన్‌లో పెట్టేసింది. అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్స్, సంతోష్  శోభన్‌తో లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రవితేజతో రావణాసుర, అల్లరి నరేష్‌తో ఆ ఒక్కటీ అడక్కు, ప్రభాస్ నటించిన కల్కిలో, శ్రీ సింహతో మత్తువదలర 2 వంటి సినిమాలలో  నటించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు మరిన్ని చిత్రాలతో బిజీ బిజీగా ఉంది. 

Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్

పవన్‌తో డేట్

ఈ నేపథ్యంలో సుమ నిర్వహిస్తున్న ఓ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకుంది. సుమతో ఆ షోలో సందడి సందడి చేసింది. అందులో తన మనసులో మాటలను బయటపెట్టింది. సుమ ప్రస్తుతం ‘చాట్ షో’ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చిన ఫరియా సినిమా హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

Also Read: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!

ఈ షోలో సుమ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది. ముందుగా సుమపై ర్యాప్ సాంగ్ పాడి అదరగొట్టేసింది. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టితో స్నేహంపై మాట్లాడింది. ఇందులో భాగంగానే తనకు ఒక మంచి అవకాశం వస్తే.. ఒకప్పటి పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తానని తెలిపింది. లవ్ అయితే యంగ్ నాగార్జునతో చేస్తానంది. అదే మ్యారేజ్ అయితే ప్రభాస్‌నే చేసుకుంటానని చెప్పుకొచ్చింది. దీంతో ఫరియా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన ప్రోమో ఒక్కటే రిలీజ్ అయింది. ఫుల్ ఎపిసోడ్ త్వరలో విడుదల కానుంది. 

Also Read: గుండెపోటుకు అరటిపండుతో చెక్‌..రోజుకు 3 తినండి

faria-abdullah | prabhas | Pawan Kalyan | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు