Raja Saab Teaser: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 'ది రాజాసాబ్' టీజర్ వచ్చేసింది. 'సలార్', 'కల్కి' వంటి భారీ చిత్రాల తరువాత పూర్తిగా వినోదాన్ని పంచే పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ, లవ్ జానర్లో నటిస్తున్న సినిమా కావడంతో ‘ది రాజా సాబ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతీ(Director Maruthi) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ హారర్ ఎంటర్టైనర్ మూవీ టీజర్ ను ఈరోజు (జూన్ 16)న ఉదయం 11:30 గంటలకు ఎట్టకేలకు రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read: కన్నప్ప సినిమాకు షాక్.. రిలీజ్‌కు బ్రేక్ !
ప్రభాస్ పంచ్ డైలాగ్స్.. వణుకుపుట్టించే విజువల్స్
మొత్తం 2 నిమిషాలు 2 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ ఔట్ అండ్ ఔట్ కామెడీ, వణుకుపుట్టించే విజువల్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. బుజ్జిగాడు తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ పంచ్ డైలాగ్స్ ఫుల్ ఫన్‌తో అదిరిపోయాయి. టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్, విజువల్ ట్రీట్‌తో ఫ్యాన్స్ కి కావాల్సినన్ని ఎలివేషన్స్ ఇచ్చింది మూవీ టీమ్.
Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
మొత్తానికి ‘ది రాజా సాబ్’ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ మూవీలో ప్రభాస్‌ను ఒక రిఫ్రెషింగ్ లుక్ లో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
నవ్విస్తూ, హారర్ కంటెంట్‌తో భయపెడుతూ 'ది రాజా సాబ్' మూవీ ఈసారి ప్రభాస్ అభిమానుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి! ఇప్పటికైతే రిలీజైన టీజర్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..