Deepika Padukone: ప్రభాస్ ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్.. షాకింగ్ పోస్ట్!

దీపికా పదుకొనేకు బిగ్‌షాక్ తగిలింది. ‘కల్కి 2’ సినిమా నుంచి ఆమెను తొలగించినట్లు ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బిడ్డ కోసం వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్ చేయాలని దీపిక రిక్వెస్ట్ చేసిందని, సెట్ కాకపోవడంతో రీప్లేస్మెంట్ కోసం చూస్తున్నట్లు టాక్.

New Update
deepika padukone exit from prabhas and nag ashwin kalki 2 movie

deepika padukone exit from prabhas and nag ashwin kalki 2 movie

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించింతో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా కూడా మరో పార్ట్ రాబోతుంది. 

ఈ సారి ‘కల్కి 2’లో అందరి పాత్రలు మరింత పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు మేకర్స్ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీక్వెల్ మూవీ నుంచి దీపికా పదుకొనేను తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమైంది? అంటూ నెట్టింట ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు

‘కల్కి2’ నుంచి దీపికా అవుట్

ఇదిలా ఉంటే వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్‌మెంట్, హై రెమ్యూనరేషన్ కారణంగా దీపికా పదుకొనేను ఇటీవల సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ నుంచి తొలగించారు. ఈ విషయంలో ఆ మధ్య సందీప్ - దీపిక మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అది మరువక ముందే ఇప్పుడు దీపికను ‘కల్కి 2’ నుంచి తొలగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ పోస్టు వైరల్‌గా మారింది. 

బాలీవుడ్ మీడియా ప్రకారం.. ‘‘కల్కి 2’లో దీపిక పదుకొనే ఉండదని సమాచారం. తన బిడ్డ కోసం వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్ చేయాలని మేకర్స్‌ని దీపిక చాలా రిక్వెస్ట్ చేసిందని.. కానీ అది సెట్ కాకపోవడంతో రీప్లేస్మెంట్ కోసం చూస్తున్నట్లు ఆ పోస్టులో రాసి ఉంది. దీంతో దీపికా పదుకొనే ప్లేస్‌లో మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌ కోసం మేకర్స్ వెతుకుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అటు మేకర్స్, కానీ దీపిక పదుకొనే కానీ ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. 

Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్‌ సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment
తాజా కథనాలు