Kannappa US Promotions: 'కన్నప్ప' గ్లోబల్ ప్రమోషన్లతో దూసుకెళ్తున్న మంచు విష్ణు..

మంచు విష్ణు మే 8 నుంచి 10 వరకు అమెరికాలో ‘కన్నప్ప’ ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. అమెరికా ప్రమోషన్స్ పూర్తవ్వగానే, తెలుగు రాష్ట్రాల్లో మీడియా సమావేశాలతో భారీ స్థాయిలో ప్రచారం చేయనున్నారు. ఈ చిత్రం 2025 జూన్ 27న విడుదల కానుంది.

New Update

Kannappa US Promotions: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మంచు విష్ణు(Manchu Vishnu) 'కన్నప్ప' ఒకటి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా సినిమా, ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్ వంటి స్టార్ హిరోస్ గెస్ట్ రోల్స్‌లో కనిపించనుండడం సినిమాపై అంచనాలు పెంచేసింది.

Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

ఈ మెగాప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు చిత్ర నిర్మాత, హీరో విష్ణు మంచు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవాలనే ఉద్దేశంతో ఆయన గ్లోబల్ ప్రమోషన్ టూర్‌ను ప్రారంభించారు.

Also Read: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

మే 8 నుండి మే 10 వరకూ అమెరికాలో భారీ ప్రమోషన్లు.. 

మంచు విష్ణు మే 8, 2025 నుండి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమాలు మే 10న 'బే' అనే ఏరియాలో ముగియనున్నాయి. అక్కడి తెలుగు ప్రేక్షకులతో పాటు అమెరికన్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ పలు ఈవెంట్లు, మీడియా ఇంటరాక్షన్లు నిర్వహించనున్నారు.

Also Read: యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

అమెరికా ప్రమోషన్స్ తర్వాత, మన దగ్గర మరింత భారీ స్థాయిలో ప్రమోషన్ ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు మంచు విషు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో జరగనున్న టూర్స్‌తో పాటు, ప్రత్యేక మీడియా సమావేశాలపై దృష్టి పెట్టనున్నారు.

Also Read: భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

'కన్నప్ప' చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ కు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మంచు విష్ణు అండ్ టీమ్ చాలా పకడ్బందీగా ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు