D K Aruna : నా ఫోన్ ట్యాప్ చేశారు..ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ను ట్యాప్ చేశారని బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణ చేశారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని ఐ ఫోన్ కంపెనీ వారు తనను అలెర్ట్ చేశారన్నారు. దీంతో తను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నానని అరుణ వివరించారు.