/rtv/media/media_files/2025/03/30/uigStbBUSUYkxqEbAM50.jpg)
Union Minister Bandi Sanjay
PHONE TAPPING : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్యాపింగ్ ఇష్యూను బీజేపీ జాతీయస్థాయి అంశంగా పరిగణిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్‌నే ఎక్కువసార్లు ట్యాప్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కేంద్ర నిఘా వర్గాలు బండి సంజయ్ ముందు పెట్టాయి. ఈ మేరకు హోంశాఖ అధికారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారంతా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికారులతో కేంద్రమంత్రి బండి సంజయ్ చర్చించారు. తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సైతం ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది.
Also Read:కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరిన BRS ఎమ్మెల్యే
SIB, సిట్, ఇంటెలిజెన్స్ అధికారులతో బండి సంజయ్ ప్రత్యేకంగా చర్చించారు. BRS హయాంలో బండి ఫోన్‌ను అధికంగా ట్యాప్ చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆ అంశం పైనే కేంద్ర వర్గాల నుంచి అవసరమైన సాక్ష్యాలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత ఆధారాలను కేంద్ర నిఘావర్గాలు బండి సంజయ్ ముందుంచినట్లు తెలిసింది. రేపే సిట్ విచారణకు బండి సంజయ్ హాజరయ్యే అవకాశం ఉండటంతో తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన అధికారులకు ఇవ్వడానికి సిద్దమయ్యారు. దీనికోసం బండి సంజయ్ అన్ని రకాల ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. సిట్ విచారణలో పలు ఆధారాలను బండి సంజయ్ సమర్పించనున్నారు. కాగా బీజేపీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని జాతీయ అంశంగా పరిగణిస్తుండంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో అని సర్వత్రా చర్చ సాగుతోంది.
Also Read : హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం.. ఆ ప్రాంతాల వారికి హెచ్చరిక
గత నెల 24న విచారణకు హాజరుకావాలని బండికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా హాజరుకాలేనని బండి సంజయ్ తెలిపారు. కాగా మరోసారి ఈ నెల 8న హాజరు కావాలని అధికారులు సూచించడంతో రేపు ఆయన సిట్ ముందుకు వెళ్లనున్నారు. దీనికోసం ఆయన పూర్తి ఆధారాలను సేకరిస్తున్నారు. అవసరమైన ఆధారాలను సిట్ ముందుంచనున్నారు.కాగా రేపు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం నుండి విచారణకు బయలు దేరనున్నారు బండి సంజయ్. విచారణకు వెళ్లడానికి ముందు ఉదయం 10.30 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తా వద్దనున్న హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ సమీపంలోని దిల్ కుశ్ గెస్ట్ హౌజ్‌కు చేరుకుంటారు. అక్కడే కొంతసేపు వేచి ఉన్న అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సిట్ విచారణకు హాజరవుతారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న అన్ని రకాల ఆధారాలను సిట్ కు అందజేస్తారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
Also Read:Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్