KCR వల్లే పోలీసుల నుంచి నాకు నోటీసులు: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాల కారణంగా పోలీసుల నుంచి ఆయనకు నోటీసులు వచ్చాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు రావాలని జూబ్లీహిల్స్‌ ఏసీపీ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

New Update
Bandi Sanjay Vs KCR

Bandi Sanjay Vs KCR

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాల కారణంగా పోలీసుల నుంచి ఆయనకు నోటీసులు వచ్చాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు రావాలని జూబ్లీహిల్స్‌ ఏసీపీ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

బండి సంజయ్ మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి. నాతో పాటు నా కుటుంబం, సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారు. పడకగదిలో దంపతుల మాటలూ ట్యాప్‌ చేసి జీవితాలను నాశనం చేశారు. నాకు తెలిసిన, నా వద్ద ఉన్న సమాచారం పోలీసులకు తెలియజేస్తానని బండి సంజయ్‌ అన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన విచారణ కోసం సిట్ అధికారుల ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి జూలై 24న ఆయన స్టేట్‌మెంట్ ఇవ్వాలని నోటీసులు వచ్చాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు