/rtv/media/media_files/2025/03/24/dmVJRS9n2ZVvnxtzK7OC.jpg)
Bandi Sanjay
Bandi Sanjay : తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనలు సృష్టిస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఈ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేసింది. కాగా ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ తాజాగా రాజకీయ నాయకులు, అధికారుల నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది.
Also Read : ఎమ్మెల్యే Vs మేయర్.. కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ
ట్యాపింగ్ ఆరోపణలపై పలువురు సిట్ ముందు హజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ కేసులో తాజాగా, కేంద్రమంత్రి, బండి సంజయ్ కుమార్‌ను సిట్ అధికారులు ఫోన్‌లో సంప్రదించినట్లు తెలిసింది. ఆయనతో పాటు ఆయన సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. దీంతో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి సిట్ సిద్ధమైంది. అందులో భాగంగా ఆయనను సిట్ కార్యాలయానికి రావలసిందిగా అధికారులు కోరారు. ఈ మేరకు ఆయనకు కాల్ చేసినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన సంజయ్ ఈ నెల 23వ వరకు తాను అందుబాటులోనే ఉంటానని, ఈ లోపు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని తెలిపినట్లు తెలిసింది. ఆయనను సిట్ విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు సిట్ సిద్ధమైంది.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!
Follow Us