Phone Tapping Case: జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ వద్ద టెన్షన్‌..టెన్షన్‌..ముగిసిన హరీశ్‌రావు విచారణ

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావును సిట్‌ మరోసారి విచారణకు పిలిచింది. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

New Update
HARISH RAO

Phone tapping case

Hairsh Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(telangana phone tapping case) లో మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు(brs-mla-harish-rao) ను (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)  సిట్‌ మరోసారి విచారణకు పిలిచింది. దీంతో ఆయన ఈ ఉదయం (మంగళవారం)  జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి.. సిట్ ముందుకు విచారణకు హాజరయ్యారు. ఆయన ఒక్కడినే స్టేషన్‌లోకి అనుమతించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. గడచిన మూడుగంటలుగా ఆయన విచారణ కొనసాగుతోంది.. విచారణ మధ్యలో విరామం ప్రకటించగా హరీశ్‌రావు ఇంటి నుంచి భోజనం తెప్పించుకున్నారు. భోజన విరామం తర్వాత మళ్లీ విచారణ కంటీన్యూ చేశారు. - phone tapping issue

కాగా సిట్‌ విచారణకు వెళ్లిన సమయంలో ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను స్టేషన్‌ లోపలికి పోలీసులు అనుమతించలేదు. హరీశ్‌రావును విచారణకు పిలిచారని తెలిసి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్‌ స్టేషన్‌ కు చేరుకున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీశ్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు.ఎన్నికల సమయంలో ఒకే రోజే 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా హరీశ్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read :  కవితతో భేటీ.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన!

స్టేషన్‌ వద్ద టెన్షన్‌...

కాగా, ఓవైపు సిట్ విచారణ కొనసాగుతుండగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సిట్ విచారణకు వచ్చిన హరీశ్ రావు వెంట భారీగా బీఆర్‌ఎస్ శ్రేణులు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే.. హరీశ్ రావు మినహా ఎవ్వరినీ అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేయడంతో వారంతా బయటే ఉండిపోయారు. అయితే స్టేషన్ చుట్టుపక్కల ఎవరూ ఉండొద్దని పోలీసులు హెచ్చరించడంతో బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచారణ అనంతరం హరీశ్‌రావును అదుపులోకి తీసుకుంటే తరువాతి పరిణామాలు ఏంటీ అనే కోణంలో బీఆర్‌ఎస్‌ వర్గాలు చర్చలు సాగిస్తున్నాయి. అవసరమైతే బెయిల్‌ కోసం న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు.

భోజన విరామం అనంతరం రెండో విడత విచారణ ప్రారంభం కానుంది. మొదటి సెషన్‌లో వచ్చిన సమాధానాల ఆధారంగా మధ్యాహ్నం తర్వాత మరిన్ని కీలక ప్రశ్నలు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. విచారణ ముగియటంతో తర్వాత సిట్ అధికారులు గానీ, హరీష్ రావు గానీ మీడియాకు ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Also Read :  ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

Advertisment
తాజా కథనాలు